పదేళ్ల నిషేధం.. అంగీకరించిన నటుడు - MicTv.in - Telugu News
mictv telugu

పదేళ్ల నిషేధం.. అంగీకరించిన నటుడు

April 9, 2022

fbfbf

ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ నటుడు విల్‌స్మిత్‌ను మోషన్ పిక్చర్స్ అకాడమీ పదేళ్లపాటు ఆస్కార్ అవార్డు ఫంక్షన్‌లో పాల్గొనకుండా నిషేధించింది. ఇటీవల ఆస్కార్ అవార్డు వేడుకల్లో తన భార్యపై అసభ్య కామెంట్లు చేసిన యాంకర్‌ను చెంప మీద కొట్టిన విషయం తెలిసిందే. ఈ విషయంపై విల్ స్మిత్ బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పాడు. అంతేకాక, అకాడమీ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు ఎలాంటి శిక్షకైనా సిద్ధమని ప్రకటించాడు. ఈ నేపథ్యంలో బోర్డు సభ్యులు శుక్రవారం సమావేశమయ్యారు. అనంతరం బోర్డు అధ్యక్షుడు డేవిడ్ రూబిన్ మాట్లాడుతూ.. ‘ఏప్రిల్ 8 నుంచి పదేళ్లపాటు ఆస్కార్ ఈవెంట్లకు, ప్రోగ్రంలకు వ్యక్తిగతంగా కానీ, వర్చువల్‌గా కానీ పాల్గొనకుండా నిషేధం విధించామ’ని వెల్లడించారు. కాగా, బోర్డు తీసుకున్న నిర్ణయంపై విల్ స్మిత్ స్పందించాడు. తనపై తీసుకున్న చర్యలను గౌరవిస్తున్నట్టు తెలిపాడు.