‘కేసీఆర్ సచ్చుడో...తెలంగాణ వచ్చుడో’...దీక్షకు పదేండ్లు - MicTv.in - Telugu News
mictv telugu

‘కేసీఆర్ సచ్చుడో…తెలంగాణ వచ్చుడో’…దీక్షకు పదేండ్లు

November 29, 2019

కేసీఆర్ సచ్చుడో…తెలంగాణ వచ్చుడో…అంటూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన ఆమరణ దీక్షకు నేటితో పదేళ్లు నిండాయి. సరిగ్గా ఇదే రోజున 2009లో కేసీఆర్ ఆమరణ దీక్ష చేపట్టారు. ఈ దీక్ష తెలంగాణ మలిదశ ఉద్యమ చరిత్రలో కీలకఘట్టం అయింది. తెలంగాణ ఉద్యమంలో ఉద్వేగాలు ఉప్పెనలుగా మారి యూనివర్సిటీ మైదానాలు కదన రంగాలుగా మారాయి. కేంద్రం దిగి వచ్చి తెలంగాణను ప్రకటించడం కేసీఆర్ 12 రోజుల దీక్ష ఫలితమే అనడంలో అతియోశక్తి లేదు. ఈ దీక్ష తెలంగాణ సమజాన్ని అనేక మలుపులు తిపింది. 1969 తర్వాత తెలంగాణ ఉద్యమం మళ్ళి పట్టలపై ఎక్కింది కేసీఆర్ దీక్షతోనే. 12 రోజుల దీక్ష తర్వాత పరిణమాలు తెలంగాణ సమాజాన్ని ఒక్క తాటి పైకి తీసుకొచ్చాయి. రాజకీయలకు అతీతంగా ప్రజలు తెలంగాణ కోసం రోడ్లెక్కరు. కాకలు తీరిన కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రన్ని సాధించారు.

2009 ముందు టిఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో క్యాడర్‌లో అలుముకున్న నిరాశానిసృహ‍లను పారదొలడానికి కేసిఆర్ ఉద్యమమే శరణ్యమని ప్రకటించారు. గతంలో తన వ్యవహార శైలిపై ఆత్మవిమర్శ చేసుకున్నారు. మారిన మానిషిగా ప్రకటించుకున్నారు. వ్యక్తిగత వ్యవహ‍రమే కాదు పార్టీ వ్యవహారాల్లో కూడా శైలి మారింది. పదేళ్ళుగా తాను నమ్ముకున్న లాబీంయిగ్‌ను 2009లో విడిచి పెట్టారు. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడానికి ఉద్యమమే శరణ్యమని ఉద్యోగులతో పాటు కదిలారు. ఫ్రీ జోన్‌ అంశాన్నిఆయుధంగా మార్చుకొని సిద్ధిపేటలో గర్జించారు. తరువాత జరిగిన ఆమరణ దీక్ష యావత్తు దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది. తెలంగాణా వాదులందరిని తిరిగి ఒక్కతాడి పైకి తేగలిగారు.

హైదరబాద్ ఫ్రీ జోన్‌తో మొదలైన రగడ ఉద్వేగాలను రగిల్చింది. తెలంగాణ కోసం కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగడం, ఉద్యమ రూపాన్నే మార్చి వేసింది. తెలంగాణలోని పల్లెలు, పట్టణాలు ఆందోళనలతో అట్టుడికిపోయాయి. సరిగ్గా పది సంవత్సరాల క్రితం కేసీఆర్ తెలంగాణ కోసం దీక్ష చేశారు. తెలంగాణ రాష్ట్రంతోనే ఈ ప్రాంత ప్రజలకు న్యాయం జరుగుతుందని టీఆర్ఎస్ అధినేత ప్రకటించారు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ఇటు రాష్ట్ర రాజకీయాలను, అటు కేంద్ర రాజకీయాలను ఓ కుదుపు కుదిపేసింది. పార్లమెంట్‌లో తెలంగాణ ప్రకటనను సాధించింది.

మెదక్ జిల్లా సిద్ధిపేట కేంద్రంగా దీక్షను ప్రారంభించాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఇందుకోసం తెలంగాణ ప్రజలను సభలు సమావేషాలతో సిద్దం చేశారు. తెలంగాణ కోసం తన ప్రాణలను ఇవ్వడానికి సిద్దంగా ఉన్నానని ప్రకటించారు. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అంటు నినాదించాడు. తన తూటాలాంటి మాటలతో తెలంగాణలో ఉన్న సకల జనులను మలిదశ ఉద్యమానికి సిద్దం చేశారు. విద్యార్ధులు, యువకులు ముందు వరసలో కేసీఆర్ దీక్షకు మద్దతు ప్రకటించారు. తెలంగాణలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కేసీఆర్‌కు తోడుగా నిలుస్తామన్నారు. కేసీఆర్ దీక్షకు ముందే రాష్ట్ర ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టింది. దీక్షను అడ్డుకొవాలని ప్రభుత్వం పక్క ప్లాన్‌తో ముందుకు పొయింది.

 

కేసీఆర్ దీక్షకు ముందు తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం నాయకులతో సమావేశం జరిపారు. తర్వాత  కరీంనగర్‌లోని తెలంగాణ భవన్ చేరుకున్నారు. దీక్ష స్ధలమైన సిద్దపెటకు బయలుదేరిన కోద్ది దూరంలోనే కేసీఆర్‌ను అరెస్టు చేసి ఖమ్మం జిల్లాకు తరలించారు. కేసీఆర్ అరెస్ట్ వార్త విన్న తెలంగాణ విద్యార్థి లోకం పోలీసుల తీరుపై ఒంటి కాలు పై లేచింది. తెలంగాణ జిల్లాల్లో అగ్గి రాజుకుంది. ఉస్మానియా యూనివర్శిటి, కాకతీయా యునివర్శిటిలు యుద్ద మైదానాలను తలపించాయి. కేసీఆర్ అరెస్టుకు నిరసనగా విద్యార్థులు భారీ ఆందోళనలకు దిగారు. అవి కాస్తా తీవ్ర ఉద్రిక్తతల నడుమ హింసాత్మకంగా మారాయి.

తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న సందర్భంలోనే ఖమ్మంలో కేసీఆర్ దీక్షను విరమించినట్టు వార్తలు గుప్పు మన్నాయి. ఇది తెలుసుకున్న తెలంగాణ విద్యార్ధిలోకం కేసీఆర్ తమను మొసం చేసినట్టు ప్రకటించి కేసీఆర్ శవయాత్రలను నిర్వహించింది. దిష్టి బొమ్మలను తగులపేట్టారు. అంతలోనే కేసీఆర్‌ తన దీక్షను కోనసాగిస్తున్నాట్టు ప్రకటించారు. తనకు బలవంతంగా నిమ్మ రసం ఇచ్చి దీక్షను భగ్నం చేసే కూట్రను ఈ ప్రభుత్వం పన్నిందని కేసీఆర్ ప్రకటించడంతో మళ్లీ తెలంగాణ విద్యార్ధులు కేసీఆర్‌కు జేజేలు పలికార

 

దీక్షలో ఉన్న కేసీఆర్ ఆరోగ్యం క్షిణించింది. ఖమ్మం నుండి హైదరాబాదుకు నిమ్స్‌కు తరలించాలని వైద్యలు సుచించారు. తెలంగాణ ఉద్యమం కరీంనగర్, ఖమ్మం వయా హైదరాబాద్ అన్నట్టుగా సాగింది. కేసీఆర్‌ను నిమ్స్‌కు తరలించారన్న వార్త తెలంగాణ పది జిల్లాలను తట్టి లేపింది. నిమ్స్ మరో తెలంగాణ ఉద్యమానికి కేరఫ్ అడ్రెస్స్‌గా మారింది. కేసీఆర్ ఆరోగ్యం రోజు రోజుకు క్షిణించాడంతో విద్యార్ధులు రెచ్చిపొయారు. ఒక దశలో హైదరాబాద్ తగలబడిపొతుంది అన్న వాతావరణం ఏర్పడింది. విద్యార్ధులు తెలంగాణ బందుకు పిలుపునిచ్చారు. సకల జనులు ఛలో అసెంబ్లీ అంటు నినాదించారు. పరిస్ధితులు కంట్రోల్ తప్పుతాయని ఇంటలిజెన్స్ బ్యూరో ఇచ్చిన నివేదికతో అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య అన్ని పార్టీలతో అఖిలపక్ష సమావేశన్ని నిర్వాహించారు

సీపియం మినహా అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సై అన్నాయి. తెలంగాణ ఇస్తే అభ్యంతరం లేదని ప్రకటించాయి. మరోవైపు రోజు రోజుకు కేసీఆర్ ఆరోగ్యం క్షిణించడంతో తెలంగాణ విషయం పార్లమెంటును తాకింది. ఈ క్రమంలో డిసెంబర్9న కేంద్రం తెలంగాణపై అనూకుల ప్రకటన చేసింది. దింతో కేసీఆర్ దీక్షను విరమించారు. తెలంగాణ ఉద్యమ సిద్దంతకర్త ఫ్రోఫెసర్ జయశంకర్ నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు. తెలంగాణ సమాజం ప్రతి ఏడాది ఈ రోజుని దీక్షా దివస్‌గా జరుపుకొంటోంది.