మళ్లీ బ్యాట్ పట్టబోతున్న సచిన్,సెహ్వాగ్.. ఎప్పుడంటే.. - MicTv.in - Telugu News
mictv telugu

మళ్లీ బ్యాట్ పట్టబోతున్న సచిన్,సెహ్వాగ్.. ఎప్పుడంటే..

October 18, 2019

టీం ఇండియా డ్యాసింగ్ ఓపెన్ బ్యాట్స్‌మెన్స్ సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్  మరోసారి బ్యాట్ పట్టబోతున్నారు. ఈ ఇద్దరు లెజెండరీలు ఈసారి కూడా ఓపెనర్లుగా బ్యాటింగ్ చేయబోతున్నారు. ఫిబ్రవరిలో జరిగే ‘రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ టీ20 ’ లీగ్‌లో భాగంగా వీరిద్దరూ ఇండియా తరుపున బరిలోకి దిగనున్నారు. వివిధ దేశాలకు చెందిన ఆనాటి లెజెండరీ ఆటగాళ్లతో జట్లు తయారు చేసి ఈ సిరీస్ నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి 16 వరకు ముంబై, పుణే వేదికగా ఈ టోర్నీ జరగనుంది. 

Tendulkar.

రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు ఈ సిరీస్ నిర్వహిస్తున్నారు. దీంట్లో సచిన్‌ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, తిలక రత్నే దిల్షాన్, బ్రెట్‌ లీ, జాంటీ రోడ్స్‌, బ్రియాన్‌ లారా వంటి లెజెండ్స్‌తో పాటు ప్రస్తుత ఆటగాళ్లు కూడా పాల్గొననున్నారు.. ఇండియా లెజెండ్స్, ఆస్ట్రేలియా లెజెండ్స్, శ్రీలంక లెజెండ్స్, దక్షిణాఫ్రికా వెస్టిండీస్‌ లెజెండ్స్‌ జట్లు పాల్గొనబోతున్నాయి. మొత్తం 10 మ్యాచ్‌లు నిర్వహించి టాప్ 2లో నిలిచిన జట్లతో ఫైనల్ మ్యాచ్ ఆడించనున్నారు. దీని ద్వారా సమకూరే డబ్బును రోడ్డు ప్రమాదాల అవగాహన కార్యక్రమాల కోసం ‘శాంత్‌ భారత్‌ – సురక్షిత్‌ భారత్‌’ సంస్థకు విరాళంగా ఇవ్వనున్నారు.