Tennis player Roger Federer has announced his retirement
mictv telugu

రిటైర్మెంట్ ప్రకటించిన టెన్నిస్ లెజెండ్ ఆటగాడు ఫెదరర్

September 15, 2022

టెన్నిస్ దిగ్గజం, స్విస్ స్టార్ రోజర్ ఫెదరర్ టెన్నిస్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు గురువారం ట్విట్టర్ వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించాడు. టెన్నిస్ కుటుంబానికి ప్రేమతో రోజర్ అనే క్యాప్షన్ పెట్టాడు ఈ 41 ఏళ్ల ఆటగాడు. వచ్చే వారం లండన్‌లో జరిగే లేవర్ కప్ చివరి ఏటీపీ ఈవెంట్ అని స్పష్టం చేశాడు. తన 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు. ఆట నుంచి తప్పుకునే సమయం వచ్చిందని, అందుకు కఠినమైన నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాడు. కాగా, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్‌గా పిలువబడే ఫెదరర్ తన కెరీర్‌లో మొత్తం 20 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు సాధించాడు. 1500 పైగా మ్యాచులాడి 310 వారాల పాటు ప్రపంచ నెంబర్ వన్‌గా కొనసాగాడు.