ఎల్జీ పాలిమర్స్ వద్ద మళ్లీ ఉద్రిక్తత.. నెట్టేస్తున్న పోలీసులు - MicTv.in - Telugu News
mictv telugu

ఎల్జీ పాలిమర్స్ వద్ద మళ్లీ ఉద్రిక్తత.. నెట్టేస్తున్న పోలీసులు

May 19, 2020

bv

అధికారులు, ప్రజాప్రతినిధులు వెంకటాపురం గ్రామాన్ని పట్టించుకోవడం లేదని గ్రామస్తులందరూ విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. వెంకటాపురంలో కాకుండా బయటి గ్రామాల్లోనే నాయకులు, అధికారులు సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారని గ్రామస్తులు ఆసహనం వ్యక్తం చేశారు. అధికారులు తమ పట్ల వివక్ష చూపుతున్నారని వాపోయారు. ఈ క్రమంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ఎదుట ఆందోళనకు దూసుకొచ్చేందుకు గ్రామస్తులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామస్తులు, పోలీసుల మధ్య కాసేపు తోపులాట చోటుచేసుకుంది. ఎల్జీ పాలిమర్స్ ఘటనలో మృతి చెందిన, దాని ప్రభావంతో ఇబ్బంది పడ్డ కుటుంబాలకు సోమవారం ముఖ్యమంత్రి  జగన్ పరిహారం అందించిన మురుసటి రోజే వెంకటాపురం గ్రామస్తులు ఆందోళనకు దిగడం గమనార్హం.

కరోనా ఆంక్షలతో ఆందోళన విరమించుకోవాలని పోలీసులు కోరినా గ్రామస్తులు వినలేదు. అధికారులు తమకు న్యాయం చేయాల్సిందేనని మూడు గుళ్ల వద్ద ఆందోళన కొనసాగిస్తున్నారు. నష్ట పరిహారం అందించడంలో తమను ప్రత్యేకంగా చూడాలని వెంకటాపురం గ్రామస్తుల డిమాండ్ చేస్తున్నారు కాగా, గ్యాస్ లీక్ దుర్ఘటనలో 12 మంది మృతి చెందగా, వందలాది మంది అస్వస్థతకు గురై ఆసుపత్రుల్లో చేరి తిరిగి డిశ్చార్జి అయిన సంగతి తెలిసిందే.