సీఎం కేసీఆర్‌ ఇంటి వద్ద ఉద్రిక్తత - MicTv.in - Telugu News
mictv telugu

సీఎం కేసీఆర్‌ ఇంటి వద్ద ఉద్రిక్తత

November 13, 2019

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 39వ రోజుకి చేరింది. ఈ క్రమంలో ఆర్టీసీ కార్మికులు నిరసన కార్యక్రమాలు చేపడుతోన్నారు. తాజాగా ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా వామపక్ష, విద్యార్థి సంఘాల నాయకులు కేసీఆర్‌ ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. కరీంనగర్ శివారులోని తీగలగుట్టపల్లిలో ఉన్న సీఎం కేసీఆర్‌ ఇంటిని ముట్టడించేందుకు వామపక్ష, విద్యార్థి సంఘాల నాయకులు తరలివస్తుండగా పోలీసులు మధ్యలోనే వారిని అడ్డుకున్నారు. దీంతో పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. 

Rtc

సీఎం కేసీఆర్ ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసి బారికేడ్లు, ప్రహరీ గోడలపై తీగల కంచెలను ఏర్పాటు చేశారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న క్రమంలో తోపులాట జరిగింది. సీఎం కేసీఆర్ ఇంటివైపు దూసుకెళ్లేందుకు యత్నించిన విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వామపక్ష నాయకులు మాట్లాడుతూ…ఉద్యమాలతో అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు ఆ ఉద్యమాలనే అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యను పరిష్కరించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు.