Tension at Khairatabad..Rajasingh's followers arrested
mictv telugu

ఖైరతాబాద్ వద్ద ఉద్రిక్తత..రాజాసింగ్ అనుచరులు అరెస్ట్

August 31, 2022

గోషామహల్‌‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇటీవలే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ, ఎంఐఎం శ్రేణులు..భవానీనగర్‌, డబీర్‌పురా, రెయిన్‌ బజార్‌ పీఎస్‌లతోపాటు రాష్ట్రవ్యాప్తంటా పలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు చేశారు. దాంతో అప్రమత్తమైన రాష్ట్ర పోలీసులు ఎమ్మెల్యే రాజాసింగ్‌ను అరెస్ట్ చేశారు.

అయితే, ఈరోజు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌‌ను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ, వీహెచ్‌పీ నేతలు ఖైరతాబాద్ మహాగణపతి వద్ద ఆందోళనకు దిగారు. రాజాసింగ్‌ను వెంటనే విడుదల చేయ్యాలని డిమాండ్ చేశారు. ఫ్లకార్డులు పట్టుకొని, ఖైరతాబాద్ గణేష్ ముందు వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ నేతలు నిరసనకు దిగారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను చేస్తున్నవారిని అరెస్ట్ చేసి, సైఫాబాద్ పోలీస్‌స్టేషన్లకు తరలించారు.

ఇక, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విషయానికొస్తే.. ఇటీవలే మహ్మద్ ప్రవక్తపై రాజాసింగ్ చేసిన అనుచిత వ్యాఖ్యల వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. దాంతో అర్థరాత్రి ఎంఐఎం శ్రేణులు రాజాసింగ్‌ను అరెస్ట్ చేయాలని రోడ్లపై బెఠాయించి ధర్నాలు చేశారు. రాజాసింగ్‌పై హైదరాబాద్‌తోపాటు, రాష్ట్రవ్యాప్తంగా పలు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. దాంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి, నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. రాజాసింగ్‌‌కు 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధమంటూ కోర్టు అభిప్రాయపడింది. రాజాసింగ్‌ రిమాండ్‌‌కు అనుమతించాలన్న పోలీసులు రిక్వెస్ట్‌ని తోసిపుచ్చుతూ, న్యాయస్థానం ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. కానీ, పోలీసులు రెండవసారి రాజాసింగ్‌ను పీడియాక్ట్ కింద అరెస్ట్ చేశారు.