టెన్షన్.. పది మంది వైద్యులకు కరోనా! - MicTv.in - Telugu News
mictv telugu

టెన్షన్.. పది మంది వైద్యులకు కరోనా!

July 4, 2020

Mahaboob Nagar.

కరోనా సంక్షోభంలో వైద్యులే ప్రత్యక్ష దైవాలు అయ్యారు. వారు బాగుంటే మనం ఈ వైరస్ బారినుంచి తప్పించుకుని ప్రాణాలతో గట్టెక్కవచ్చు. లేదంటే కరోనా నుంచి మనల్ని ఆ బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు. అయితే కరోనా ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. అటు వైద్యులను, వైద్య సిబ్బందిని, ఇటు పోలీసులను వేటాడుతోంది. వారిని కూడా బలి తీసుకుంటోంది. దీంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. వారికి ఏమైనా అయితే మనల్ని రక్షించే ఆపద్భాంధవుడు ఎవరన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది? మరోవైపు పారిశుద్ధ్య కార్మికులు, మీడియా ప్రతినిధులు కూడా కరోనా కాటుకు బలి అవుతున్నారు. 

ఈ క్రమంలో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోనూ కరోనా వైద్యులను వెంటాడుతోంది. జిల్లా కేంద్రంలో ఇప్పటి వరకు 10 మంది ప్రముఖ డాక్టర్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో వారి వద్దకు వైద్యానికి వెళ్లినవాళ్లకు, ఆ డాక్టర్ల దగ్గర పనిచేసే సిబ్బందిలో తీవ్ర ఆందోళన నెలకొంది. వెంటనే వారంతా కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారని తెలుస్తోంది. అప్రమత్తమైన అధికారులు వారి కాంటాక్ట్‌లను వెలికి తీసి వారికి పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు.