కరోనా ఫ్రీ జిల్లా భువనగిరిలో టెన్షన్.. తొలి కేసు నమోదు - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా ఫ్రీ జిల్లా భువనగిరిలో టెన్షన్.. తొలి కేసు నమోదు

June 6, 2020

Yadadri Bhuvanagiri.

తెలంగాణలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసులు కేవలం హైదరాబాద్‌ పరిధిలోనే నమోదయ్యేవి. అరకొర జిల్లాల్లో ఒకటి అరా అన్నతీరుగా నమోదయ్యేవి. అయితే లాక్‌డౌన్ 5.0 సడలింపులతో ఎక్కడెక్కడో ఉన్న వలస కార్మికులు రాష్ట్రానికి రావడంతో కేసులు పెరుగుతున్నాయి. అలాగే హైదరాబాద్‌లో ఉన్నవారు వివిధ జిల్లాలకు వెళ్తుండటంతో జిల్లాలలో కేసులు పెరుగుతున్నాయి. తాజాగా యాదాద్రి భువనగిరిలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఇన్నాళ్లు కరోనా ఫ్రీ జిల్లాగా ఉన్న భువనగిరిలో పాజిటివ్ కేసు నమోదవడం కలకలం రేపుతోంది. మే 31న ఢిల్లీ నుంచి ఓ యువకుడు భువనగిరికి వచ్చాడు. అతడిలో వ్యాది లక్షణాలు బయపడడంతో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. 

అయితే సదరు యువకుడితో కాంటాక్ట్‌ అయిన 9 మందిని అధికారులు గుర్తించారు. వారిని బీబీనగర్ ఎయిమ్స్‌లోని ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. ఇదిలావుండగా చౌటుప్పల్‌ మండలం ఎస్‌.లింగోటం గ్రామానికి చెందిన దంపతులు గత నెల 13న ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో భర్త మృతి చెందాడు. భార్య అప్పటినుంచి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ క్రమంలో ఆమెకు వైద్యులు పరీక్షలు నిర్వహించగా, కరోనా పాజిటివ్‌గా తేలింది.