యాదాద్రిలో ఉద్రిక్తత.. ఆటోడ్రైవర్ల ముందస్తు అరెస్టు - MicTv.in - Telugu News
mictv telugu

యాదాద్రిలో ఉద్రిక్తత.. ఆటోడ్రైవర్ల ముందస్తు అరెస్టు

June 13, 2022

యాదగిరిగుట్ట వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కొండ పైకి ఆటోలను అనుమతించాలనే డిమాండ్‌తో గత రెండు నెలలుగా నిరసన కార్యక్రమాలు చేపట్టిన ఆటో కార్మికులు ఇవాళ ప్రగతిభవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు.. ఆటో కార్మికులను అదుపులో తీసుకున్నారు. తెల్లవారుజాము నుంచే ఆటో కార్మికులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆటో డ్రైవర్ల యూనియన్ నాయకులతోపాటు.. నిరసనల్లో చురుగ్గా పాల్గొంటున్న వారిని ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు.
సుమారు ఆరేళ్లకుపైగా యాదగిరిగుట్ట ఆలయం పునరుద్ధరణ పనులు పూర్తయిన తర్వాత భక్తులందరికీ దర్శనాలు ప్రారంభించిన తర్వాత తమ ఆదాయం పెరుగుతుందని భావిస్తే.. పొట్ట కొట్టేలా చేస్తున్నారని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు 22 మంది ఆటో డ్రైవర్లను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసుల అరెస్టులను గుర్తించిన ఆటో డ్రైవర్లలో పలువురు ఆటోలను ఇళ్ల వద్దే వదిలి ప్రగతిభవన్ కు బయలుదేరినట్లు తెలుస్తోంది.