ఆదిలాబాద్‌ థియేటర్లో ' కశ్మీర్ ఫైల్స్'పై ఉద్రికత్త - MicTv.in - Telugu News
mictv telugu

ఆదిలాబాద్‌ థియేటర్లో ‘ కశ్మీర్ ఫైల్స్’పై ఉద్రికత్త

March 19, 2022

vdxv

 

తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్‌లో ఇటీవలే బాలీవుడ్‌లో విడుదలైనా ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా కోసం ప్రేక్షకులు కొట్టుకున్న సంఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ పట్టణంలోని నటరాజ్ థియేటర్‌లో శుక్రవారం ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా ప్రదర్శన జరుగుతుండగా ఓ ఇద్దరు వ్యక్తులు పాకిస్థాన్‌కు జై కొట్టారు. దీంతో థియేటర్‌లో ఉద్రిక్తత నెలకొంది.

ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌కు జై కొట్టిన వ్యక్తులపై కొందరు ప్రేక్షకులు దాడి చేశారు. దీంతో పరిస్థితిని గమనించిన ఆ ఇద్దరు వ్యక్తులు సినిమా హాల్ నుంచి పరారైయ్యారు. అనంతరం విషయం తెలుసుకున్న పోలీసులు థియేటర్‌కు చేరుకొని, పరిస్థితిని అదుపు చేశారు. పోలీసులు మాట్లాడుతూ.. ‘ ఆ ఇద్దరు వ్యక్తులు బాగా మద్యం తాగారు. దాంతో ఆ మత్తులో పాకిస్తాన్ దేశానికి జై కొట్టి, అక్కడి నుంచి పరారైయ్యారు” అని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.