Home > Featured > టెన్త్, ఇంటర్ పాసైతే, నాలుగేళ్ల పాటు ఉద్యోగం: కేంద్రం

టెన్త్, ఇంటర్ పాసైతే, నాలుగేళ్ల పాటు ఉద్యోగం: కేంద్రం

Tent, Inter Passage, Job for four years: Center

కేంద్ర రక్షణ శాఖ టెన్త్, ఇంటర్ పూర్తైన విద్యార్థులకు ఓ కీలక విషయాన్ని తెలియజేసింది. టెన్త్, ఇంటర్ పాసైన వారు త్రివిధ దళాల్లో చేరి, దేశానికి స్వల్ప కాలం పాటు సేవలు అందించేందుకు అవకాశాన్ని కల్పిస్తున్నామని, ఇందుకోసం ‘భారత్ కే అగ్నివీర్ పేరు’తో ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చామని అధికారులు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ఈ పథకం కింద.. నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీలో నాలుగేళ్ల పాటు సేవలు అందించేందుకు స్వల్పకాల వ్యవధి ఉంటుందని పేర్కొన్నారు.

రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, త్రివిద దళాల అధిపతులతో నేడు ఢిల్లీలో సమావేశమైయ్యారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి, పూర్తి వివరాలను వెల్లడించారు. రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.."అగ్నిపథ్ పథకాన్ని ఆమోదిస్తూ, భద్రతా వ్యవహరాల కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. సాయుధ దళాలకు యువ రూపాన్ని కల్పించేందుకు ఈ పథకం కింద చర్యలు తీసుకోనున్నాం. యువతకు కొత్త సాంకేతికతలపై శిక్షణ ఇస్తాం. వివిధ రంగాల్లో భిన్న నైపుణ్యాలు ఉన్నవారికి ఈ పథకం ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. అఖిల భారత స్థాయిలో ప్రతిభ ఆధారంగా నియామకాలు ఉంటాయి. 17.5 నుంచి 21 ఏళ్ల వయసులోపు వారిని చేర్చుకోవాలని అనుకుంటున్నాం. ఒక్కసారి ఎంపికైతే అగ్నివీర్స్ నాలుగేళ్లపాటు సేవలు అందించాలి" అని ఆయన అన్నారు.

అనంతరం సైనిక దళాల అడిషనల్ సెక్రటరీ లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పూరి మాట్లాడుతూ.. "ఈ పథకం కింద యువతీ, యువకులు సైనిక దళాల్లో చేరే అర్హత ఉంటుంది. వయసు 17-21 మధ్య ఉండాలి. ప్రస్తుతం సైనిక దళాల్లో చేరేందుకు ఉన్న శారీరక సామర్థ్యం, వైద్య అర్హతలే వర్తిస్తాయి. 10వ తరగతి, 12వ తరగతి ఉత్తీర్ణులైన వారిని తీసుకుంటాం. అగ్నివీర్స్‌కు ఏటా 4.76 లక్షలు మొదటి ఏడాది చెల్లిస్తారు. రెండో ఏడాది నుంచి రూ.6.92 లక్షలు చెల్లిస్తారు. పలు రకాల అలవెన్స్‌లు కూడా ఉంటాయి. నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న తర్వాత రూ.11.7 లక్షలు చెల్లిస్తాం. ఈ మొత్తంపై పన్ను ఉండదు. నాలుగేళ్ల సర్వీసు పూర్తయిన తర్వాత రెగ్యులర్ కేడర్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అవసరాలు, అర్హతలను బట్టి 25 శాతం మందిని తీసుకుంటాం" అని ఆయన అన్నారు.

Updated : 14 Jun 2022 3:55 AM GMT
Tags:    
Next Story
Share it
Top