టెన్త్ విద్యార్థులకు.. జగన్ సర్కార్ గుడ్‌న్యూస్ - MicTv.in - Telugu News
mictv telugu

టెన్త్ విద్యార్థులకు.. జగన్ సర్కార్ గుడ్‌న్యూస్

June 17, 2022

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పదోవ తరగతి విద్యార్థులకు ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేశారు. ఇటీవలే వెలువడిన పదోవ తరగతి ఫలితాల విషయంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు ఆవేదనకు గురయ్యారు. ఫలితాల విషయంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు.

ఈ క్రమంలో జగన్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..” పదోవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణతా శాతం విషయంలో విద్యార్థిని, విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందొద్దు. ఉత్తీర్ణతా శాతం తక్కువగా రావడాన్ని తల్లిదండ్రులు తప్పుగా భావించకూడదు. పరీక్షల్లో ఫెయిల్ అయిన వారికి నెల రోజుల్లోనే మళ్లీ కంపార్ట్‌మెంట్ ఎగ్జామ్స్ పెడతాం. ఇందులో పాస్ అయిన విద్యార్థిని, విద్యార్థులను రెగ్యులర్‌గానే పరిగణిస్తాం. పదోవ తరగతి పరీక్షల్లో పాస్ అయిన వారికి కూడా బెటర్‌మెంట్ రాసుకునే సదుపాయాన్ని కల్పిసున్నాం. ఏదైనా రెండు సబ్జెక్టుల్లో బెటర్‌మెంట్ రాసుకోవచ్చు. 49 అంతకంటే తక్కువ మార్కులు వచ్చిన వారు రూ. 500 ఫీజు కట్టి రెండు సబ్జెక్టుల్లో బెటర్‌మెంట్ రాసుకోవచ్చు” అని ఆయన అన్నారు.

మరోపక్క తొలిసారిగా ఏపీ ప్రభుత్వం టెన్త్‌ విద్యార్థులకు బెటర్‌మెంట్‌ రాసుకునే అవకాశమిచ్చింది. ఇప్పటివరకూ ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థులకు మాత్రమే బెటర్‌మెంట్‌ అవకాశం ఉంది. కాగా, రెండేళ్ల కోవిడ్‌ పరిస్థితులతో ఉత్తీర్ణతాశాతం తగ్గిన నేపథ్యంలో పదవ తరగతి విద్యార్థుల సౌలభ్య కోసం బెటర్‌మెంట్‌ అవకాశమిస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. 50 మార్కుల కంటే తక్కువ వచ్చిన ఏదైనా రెండు సబ్జెక్ట్‌లకు సప్లిమెంటరీలో బెటర్‌మెంట్‌ రాసే అవకాశమిస్తూ, సబ్జెక్ట్‌కు 500 రూపాయల చొప్పున రెండు సబ్జెక్ట్‌లకు 1000 రూపాయిల ఫీజుగా నిర్ణయించింది.