Tenth class girl gangraped in delhi Three arrested
mictv telugu

రాజధానిలో మరో దారుణం.. కారులో బాలికపై గ్యాంగ్‌ రేప్

July 15, 2022

Tenth class girl gangraped in delhi Three arrested

దేశంలో మహిళల రక్ష‌ణ కోసం ఎన్ని చ‌ట్టాలు తీసుకువ‌చ్చినా వారిపై దాడులు, అఘాయిత్యాలు నిత్యం చోటుచేసుంటూనే ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే కారులో ఒక మైన‌ర్ బాలిక‌పై సామూహిక లైంగిక‌దాడికి పాల్ప‌డ్డారు. దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. పదో తరగతి విద్యార్థినిని అపహరించి.. ఆ తర్వాత కారులో ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు కామాంధులు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. పోలీసులు ఇద్దరు నిందితులతో సహా ఆమె బాయ్ఫ్రెండ్ను కూడా అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. జులై 6న వసంత్ విహార్లోని మార్కెట్లో పదో తరగతి విద్యార్థినిని ఇద్దరు యువకులు కిడ్నాప్ చేశారు. ఆపై మహిపాల్పుర్ ప్రాంతంలో కారు పార్క్ చేసి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం ఆమె ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లింది. ఆ తర్వాత కుటుంబసభ్యులు ఆరా తీయగా.. జరిగినదంతా చెప్పింది. జులై 8న బాధితురాలు తన తండ్రితో ఆసుపత్రికి వెళ్లింది. వెంటనే హాస్పిటల్ యాజమాన్యం పోలీసులకు సమచారం అందించింది. ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు.. బాలికను విచారించారు. బాధితురాలి ఫిర్యాదు అందుకుని నిందితులపై కేసు నమోదు చేశారు. ఇద్దరు యువకులతో పాటు బాధితురాలి బాయ్ఫ్రెండ్ను పోలీసులు అరెస్ట్ చేశారు.