గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. 30 మార్కులకే పదో తరగతి పాస్ - MicTv.in - Telugu News
mictv telugu

గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. 30 మార్కులకే పదో తరగతి పాస్

March 28, 2022

తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పాసవ్వాలంటే ప్రతీ సబ్జెక్టులో కనీసం 35 మార్కులు రావాల్సిందే. కానీ, బీహార్‌లో 30 మార్కులు తెచ్చుకుంటే చాలు. ఈనెల 31న పదో తరగతి రిజల్ట్స్ రానున్న నేపథ్యంలో అక్కడి బోర్డు ఈ నిర్ణయాన్ని తీసుకుంది. దీంతో అక్కడి విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీహార్‌లో ఈ ఏడాది 17 లక్షల మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యారు. గతేడాది పదో తరగతి ఉత్తీర్ణతా శాతం 78.17 కాగా, తాజా నిర్ణయంతో ఆ శాతం పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే వచ్చిన ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణతా శాతం 80.15గా ఉంది. కాగా, కరోనా కారణంగా గత రెండేళ్లు పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను పై తరగతులకు పంపించారు. ఈ సారి పరీక్ష పెడుతున్నా.. బడులు ఆలస్యంగా మొదలవడంతో ఉత్తీర్ణతా మార్కులను తగ్గించినట్టు తెలుస్తోంది.