రేపే పది ఫలితాలు: సబితా ఇంద్రారెడ్డి - MicTv.in - Telugu News
mictv telugu

రేపే పది ఫలితాలు: సబితా ఇంద్రారెడ్డి

June 29, 2022

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే పదోవ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థిని, విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఓ కీలక విషయాన్ని తెలియజేశారు. రేపు (గురువారం) పదోవ తరగతి పరీక్షల ఫలితాలను వెల్లడిస్తామని మంగళవారం ఆమె అధికారిక ప్రకటన విడుదల చేసినట్లు పరీక్షల విభాగం సంచాలకుడు కృష్ణారావు తెలిపారు.

పరీక్షల విభాగం సంచాలకుడు కృష్ణారావు మాట్లాడుతూ..”హైదరాబాద్‌లో గురువారం ఉదయం 11.30కు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేస్తారు. ఫలితాలను విద్యార్థిని, విద్యార్థులు bse.telangana.gov.in, bseresults.telangana.gov.in వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు. జూన్ 2తో తెలంగాణలో పది పరీక్షలు ముగిశాయి. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది హాజరయ్యారు.” అని ఆయన అన్నారు.

మరోపక్క పదోవ తరగతి ఫలితాల కోసం విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు, పాఠశాలల యాజమన్యాలు వేయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో పది పరీక్షల ఫలితాలకు సంబంధించి పరీక్షల విభాగం సంచాలకుడు కృష్ణారావు రేపు ఫలితాలను విడుదల చేస్తామని వివరాలను వెల్లడించారు. మంగళవారం ఇంటర్ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్‌లో 63.32 శాతం, ఇంటర్ సెకండియర్‌లో 67.16 శాతం విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా మొదటిస్థానంలో, హన్మకొండ జిల్లా రెండో స్థానంలో ఉన్నాయి.