Terrible accident..how long..video viral
mictv telugu

ఘోర ప్రమాదం..ఇలా ఎంత కాలం..వీడియో వైరల్

September 4, 2022

”త్రుటిలో తప్పించుకున్నారు. కానీ, ఇలా ఎంత కాలం అదృష్టంపై ఆధారపడతారు? రోడ్లపై బాధ్యతగా ఉండండి” అంటూ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వీడియోను వీక్షిస్తున్న వారంతా ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.

 

వీడియోలో..”బిజీ రోడ్డులో ఓ మహిళ రోడ్డు పక్కన వెళ్తూ వీధి దారిని దాటుతుంటుంది. ఆ ముందే ఓ ఆటో డ్రైవర్ ఆటోను నిలిపి వేచి చూస్తున్నాడు. ఇంతలోనే ఓ కారు వేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టగా, బోల్తా పడింది. అయితే, రోడ్డుపై వెళ్తున్న మహిళ రెండు వాహనాల మధ్య నుంచి రెప్పపాటులో ప్రమాదం నుంచి బయటపడుతుంది”.

ఈ వీడియో వైరల్‌గా మారడంతో నెటిజన్స్.. రోడ్డుపై వెళ్లేప్పుడు బాధ్యతగా మెలగాలని, ప్రమాదల నివారణకు చట్టాలను పటిష్టం చేయాలని పలువురు కోరుతున్నారు. మరికొందరేమో రోడ్డు భద్రత నిబంధనలను మరింత కఠినతరం చేయాలని సూచిస్తున్నారు. ఇంకొందరైతే ప్రభుత్వం ఎన్ని నిబంధనలు తెచ్చినా ప్రజలు బాధ్యతగా లేకపోతే ప్రయోజనం ఉండదని, కాబట్టి ప్రజలు మరింత బాధ్యతగా ఉండాలని సలహా ఇస్తున్నారు.