చైనాలో ఘోర ప్రమాదం.. 133 స్పాట్ డెడ్! - MicTv.in - Telugu News
mictv telugu

చైనాలో ఘోర ప్రమాదం.. 133 స్పాట్ డెడ్!

March 21, 2022

nm

చైనా దేశంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 133 మంది స్పాట్‌లోనే మృతి చెందినట్లు సమాచారం. సోమవారం మధ్యాహ్నం బోయింగ్ 737 విమానం కున్మింగ్ నగరం నుంచి బయలుదేరింది. విమానంలో 129 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బంది ఉన్నారు. అయితే, ఈ విమానం కాసేపటికే చైనాలో గుయాన్టి ప్రాంతంలో ఓ పర్వతాన్ని ఢీకొట్టి కూలినట్లు తెలుస్తోంది. విమానం కూలిన ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగినట్లు అక్కడి ప్రజలు పేర్కొన్నారు.

అనంతరం సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి బయల్దేరారు. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులపై ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. అయితే, ప్రమాద తీవ్రతను బట్టి విమానంలో ఉన్న వారు ఎవరూ బతికే అవకాశం లేదని చైనా దేశపు స్థానిక మీడియాలు పేర్కొన్నాయి. గతంలో 2010లో చైనాలోని యిచున్ ప్రాంతంలో విమానం కుప్పకూలిన ఘటనలో 42 మంది మరణించిన విషయం తెలిసిందే.