కామారెడ్డిలో ఘోర ప్రమాదం.. 9మంది స్పాట్ డెడ్ - MicTv.in - Telugu News
mictv telugu

కామారెడ్డిలో ఘోర ప్రమాదం.. 9మంది స్పాట్ డెడ్

May 9, 2022

తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో 14 మందికి తీవ్రంగా గాయలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ”ఎల్లారెడ్డి పోలీసు స్టేషన్ పరిధిలోని హసన్‌పల్లి గేటు వద్ద ఆదివారం సాయంత్రం టాటా ఏసి వాహనం, ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. వాహనంలో ప్రయాణిస్తున్న 25 మందిలో తొమ్మిది స్పాట్‌లోనే చనిపోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన 14 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి” అని తెలిపారు.

వీళ్లంతా పిట్లంలో ఓ దశ దినకర్మకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని, ప్రమాదానికి కారణం డ్రైవర్ వాహనాన్ని అతివేగంగా నడపడం వల్లే ఈ ఘోరం జరిగిందని అక్కడి స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ సాయిలుతోపాటు (25), లచ్చవ్వ (45), అంజవ్వ (40), వీరమణి (88), సాయవ్వ(40), వీరవ్వ (70), గంగామణి (45), ఎల్లయ్య (45), పోచయ్య (44) మృతి చెందారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.