ఉక్రెయిన్‌లో ఘోర సంఘటన.. ఏకంగా - MicTv.in - Telugu News
mictv telugu

ఉక్రెయిన్‌లో ఘోర సంఘటన.. ఏకంగా

April 4, 2022

bfbfdb

ఉక్రెయిన్ దేశంలో జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం ప్రపంచ దేశాలను కలిచివేస్తుంది. ఒకటి కాదు. రెండు కాదు. ఏకంగా మూడు వందల మృతదేహాలను 45 అడుగుల పొడవైన గుంత తీసి, సామూహికంగా సమాధి చేశారు. ఉక్రెయిన్ దేశంపై రష్యా దేశపు బలగాలు దాదాపు 38 రోజులపాటు భీకరంగా దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో భాగంగా రష్యా సైనికులు ఘోరాతి ఘోరంగా సామాన్య ప్రజల ప్రాణాలను తీశారు. నేలపై పడుకోబెట్టి, చేతుల్ని వెనక్కి కట్టి, తల వెనుక భాగంలో పేల్చి.. ఒకరిని కాదు. ఇద్దరిని కాదు. ఏకంగా 300మంది ప్రాణాలను తీసి, రోడ్లపై పడేశారు.

రష్యా సైనికులు యుద్ధ కాంక్షతో మానవత్వం మరిచి, అమాయక ప్రజల ప్రాణాలను బలితీశారు. మృతుల్లో పసి పిల్లలు ఉన్న పట్టించుకోకుండా ప్రాణాలను గాలిలో కలిపేశారు. ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్‌కు సమీపంలోని బుచా పట్టణంలో ఒకేచోట దాదాపు 300 మంది పౌరులు నిర్జీవంగా పడి ఉండగా, ఆ మృతదేహాలకు సామూహిక అంత్యక్రియలు నిర్వహించారు. ఆ భౌతికకాయాలను ఖననం చేసేందుకు 45 అడుగుల పొడవైన కందకం తవ్వినట్లు తెలుస్తోంది. ‘మృతదేహాలను సామూహికంగా సమాధి చేసేందుకు మార్చి 10న సెయింట్ ఆండ్రూ చర్చి వద్ద గుంత తవ్విన సంకేతాలున్నాయి.

మరోపక్క ఉక్రెయిన్ రక్షణ శాఖ మంత్రి దిమిత్రి కులేబా మాట్లాడుతూ.. ”మార్చి 31న చర్చి సమీపంలో సుమారు 45 అడుగుల పొడవైన కందకం తవ్వినారు. కీవ్‌కు 37 కిలోమీటర్ల దూరంలో ఈ దయనీయ దృశ్యాలు ఉన్నాయి. ఒక చర్చిలో సామూహిక ఖననం జరిపిన దగ్గర మృతదేహాల చేతులు, కాళ్లు పైకి పొడుచుకున్నాయి. ఇదంతా ఉద్దేశపూర్వకంగా జరిపిన మారణకాండ” అని ఉక్రెయిన్ రక్షణ శాఖ మంత్రి దిమిత్రి కులేబా మండిపడ్డారు.