Pakistan : పాకిస్తాన్‎లో పెట్రోలింగ్ స్క్వాడ్‎పై ఉగ్రదాడి...ఇద్దరు పోలీసులు మృతి, పలువురికి గాయాలు..!! - Telugu News - Mic tv
mictv telugu

Pakistan : పాకిస్తాన్‎లో పెట్రోలింగ్ స్క్వాడ్‎పై ఉగ్రదాడి…ఇద్దరు పోలీసులు మృతి, పలువురికి గాయాలు..!!

February 26, 2023

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని ఖుజ్దార్ జిల్లాలో పెట్రోలింగ్ స్క్వాడ్‎పై ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటన ఇద్దరు పోలీసులు మరణించారు. పలువురికి గాయలయ్యాయి. రిమోట్‌తో పేలుళ్లకు పాకిస్థాన్‌కు చెందిన స్థానిక పత్రిక డాన్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. ఖుజ్దార్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) ముహమ్మద్ జాన్ ససోలి మాట్లాడుతూ, ఖుజ్దార్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP) ఫహద్ ఖాన్ ఖోసో భద్రతా దళం ఝలావాన్ కాంప్లెక్స్ సమీపంలో ‘రిమోట్-కంట్రోల్డ్ బ్లాస్ట్’లో లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఒక పోలీసు అధికారి అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరు చికిత్స పొందుతూ మరణించినట్లు వెల్లడించారు.

పోలీసులు తెలిపిన పూర్తి వివరాల ప్రకారం.. ‘పేలుడు జరిగినప్పుడు ఎస్పీ ఖుజ్దార్ స్క్వాడ్ ఆ ప్రాంతంలో గస్తీ తిరుగుతోంది. పేలుడు జరిగిన ప్రదేశానికి అదనపు పోలీసు బృందాలు చేరుకున్నాయని, ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయని ఎస్‌హెచ్‌ఓ తెలిపారు. కాగా బలూచిస్థాన్ ముఖ్యమంత్రి అబ్దుల్ ఖుద్దూస్ బిజెంజో ఈ ఘటనను ఖండించారు. మరణించిన, గాయపడిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఇలాంటి పిరికిపంద చర్యలు మన భద్రతా బలగాల మనోధైర్యాన్ని దెబ్బతీయలేవని అన్నారు.