ఎస్...వారిని వెతికి మరీ చంపాలి..! - MicTv.in - Telugu News
mictv telugu

ఎస్…వారిని వెతికి మరీ చంపాలి..!

July 11, 2017

నేరుగా యుద్ధానికి రండి. అప్పుడు ఎవరు గెలుస్తారో చూద్దాం. అమాయకులపై దాడి చేస్తే అది మీకెలా ఉపయోగపడుతుంది. అమాయకులని చంపేశారు. ఇది సిగ్గుపడాల్సిన విషయం. ఓ పక్క కోపంగా మరో పక్కబాధగా ఉంది. అసలు ఇంత దారుణమైన దాడికి పాల్పడాల్సిన అవసరం ఏమొచ్చింది? దీనికి కారణమైన వారిని వెతికి మరీ చంపాలి. ఎస్ చంపాల్సిందే.. ఇవీ అమర్ నాథ్ యాత్రపై ఉగ్రవాదులు దాడి చేయడాన్ని ఖండిస్తూ ప్రముఖులు ఆవేశంలో అన్న మాటలు.

అవును వీళ్ల ఆవేశానికి అర్థం ఉంది. కానీ ఎంత మందిని ఇలా చంపుకుంటూ పోవాలి. ఎన్నాళ్లూ వారి కోసం వెయిట్ చేసి పోరాడాలి. దాడికి దాడియే కాదు సమాధానం కాదు…అంతకు మించి ఉండాలి. ఉగ్రవాదులు ఆలోచించలేని స్థాయిలో దెబ్బ కొట్టాలి. అది మామూలుగా కాదు.. కోలుకుండా.. సర్జికల్ స్ట్రయిక్స్ కంటే ఎక్కువగా ఉండాలి. ఉగ్రమూలాలు ఎక్కడ ఉన్నాయో కనిపెట్టాలి. అక్కడ్నుంచి నరుక్కుంటూ రావాలి.

అమెరికాలో ట్వీన్ టవర్స్ పై దాడి తర్వాత ..ఏలాంటి చర్యలు తీసుకున్నారు. మళ్లీ అమెరికా వైపు కన్నెత్తి చూడాలంటేనే ఉగ్రమూక …పోసుకుంటుంది. అదే భారత్ ఎందుకు చేయలేకపోతోంది.? ఉగ్రవాదులు ఎన్నిసార్లు ఇలా రెచ్చిపోతూనే ఉంటారు… ప్రాంతాలు మార్చి..టార్గెట్లు మార్చి మార్చి జనం ఉసురు తీస్తున్నారు.ఇలా ఇంకెన్నాళ్లు..?

శాశ్వతంగా ఉగ్రవాదుల్ని ఏరిపారేయాలి. ఉగ్రవాదలు దేశంలోకి చొరబడకుండా చేయాలి..ఇప్పటికైనా కశ్మీర్ గల్లీ గల్లీ జల్లెడ పట్టి కలుగు దాక్కున్నా టెర్రరిస్టుల్ని వదలొద్దు.వారికి సపోర్ట్ చేస్తున్న వారి తాటతీయాలి. ఉగ్ర ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టాలి.అప్పుడే ఏమైనా దేశం సరిహద్దులో ప్రశాంతంగా ఉంటుంది. లేదంటే ఇలా ఖండ ఖండాలుగా ఖండిస్తూనే పోవాలి.