హైదరాబాద్‌లో ఐసిస్  ఉగ్రవాదులు  - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌లో ఐసిస్  ఉగ్రవాదులు 

September 9, 2017

కొన్నాళ్లు ఉగ్రవాదుల ఊసులేని హైదరాబాద్ నగరం  ఐసిస్ కదలికలతో ఉలిక్కిపడింది. నగరంలో ముగ్గురు ఐసిస్ ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. బండ్లగూడ సమీపంలోని సన్ సిటీలో  అబ్దుల్ మాలిక్, అతని కొడుకులు ఫజుల్లా, ఖయ్యూంలను ఉత్తరప్రదేశ్ పోలీసులు పక్కా సమాచారంలో అరెస్ట్ చేశారు. వారి నుంచి నిషేధిత సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. విచారణ నిమిత్తం ఉత్తరప్రదేశ్ కు తరలించారు. వీరు ఇంటర్నెట్ ద్వారా ఉగ్రవాద ప్రచారం చేస్తున్నారని, ఐసిస్ నేతలతోె సంబంధాలు నెరుపుతున్నారని పోలీసులు చెప్పారు. తెలంగాణ పోలీసుల సాయంతో వీరిని యూపీ పోలీసులు పట్టుకున్నారు.