Terrorist assigned to kill Nupur Sharma arrested by UP ATS in Saharanpur
mictv telugu

నుపూర్ శర్మ హత్యకు కుట్ర.. ATS కి చిక్కిన టెర్రరిస్ట్

August 12, 2022

Terrorist assigned to kill Nupur Sharma arrested by UP ATS in Saharanpur

మహ్మద్ ప్రవక్త పై అనుచిత వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్న బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మను చంపే ప్రయత్నాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. గత నెల 16న కేవలం నుపుర్ శర్మను చంపాలనే ఉద్దేశంతోనే పాకిస్తాన్ నుంచి రిజ్వాన్‌ అష్రాఫ్‌ అనే యువకుడు సరిహద్దులు దాటుకొని వచ్చాడు. రాజస్థాన్‌లోని శ్రీ గంగా నగర్ జిల్లాలోని హిందుమాల్కోట్‌ బోర్డర్‌ అవుట్‌పోస్ట్‌ సమీపంలో పెట్రోలింగ్‌ చేస్తున్న సిబ్బందికి కనిపించాడు కాబట్టి..అతడిని అదుపులోకి తీసుకోవడం జరిగింది.

తాజాగా మహ్మద్ నదీమ్ అనే మరో టెర్రరిస్ట్ నుపుర్ శర్మను హత్య చేయాలని చూశాడు. షహరాన్‌పూర్‌కు చెందిన నదీమ్‌‌.. నుపుర్ ను చంపేందుకు ప్రయత్నించగా అతడిని యూపీ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అదుపులోకి తీసుకుంది. నదీమ్‌‌ 2018 నుంచి సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఏర్పరచుకున్నాడని పోలీసులు వెల్లడించారు. జైష్ ఎ మహ్మద్‌, తెహ్రీక్ ఎ తాలిబన్ వంటి ఉగ్రవాద సంస్థలతో నదీమ్‌కు సంబంధాలున్నాయని తేల్చారు. యూపీలో భారీ విధ్వంసానికి కుట్ర చేస్తుండగా నదీమ్‌ను ఏటీఎస్ అదుపులోకి తీసుకుంది. విచారణ కొనసాగుతోంది.