అన్ని మతాల్లో ఉగ్రవాదులు ఉన్నారు..కమల్ హాసన్ - MicTv.in - Telugu News
mictv telugu

అన్ని మతాల్లో ఉగ్రవాదులు ఉన్నారు..కమల్ హాసన్

May 17, 2019

ప్రముఖ నటుడు, మక్కల్‌ నీది మయ్యుం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కమల్‌ హాసన్‌ తమిళనాడులోని అరవకురిచిలో ఆదివారం సాయంత్రం జరిగిన ప్రచార ర్యాలీలో ప్రసంగిస్తూ.. ‘స్వతంత్ర భారత తొలి ఉగ్రవాది హిందూనే’ అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరామ్‌ గాడ్సేను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, కమల్ వ్యాఖ్యలపై పలువురు నేతలు మండిపడుతున్నారు. కమల్ ను అరెస్ట్ చేయాలనీ కోర్టులో కేసులు కూడా వేశారు. దీంతో కమల్ హాసన్ ముందస్తు బెయిల్ కోసం మదురై కోర్టుని ఆశ్రయించారు.

అయితే కమల్ తన ఉగ్రవాది వ్యాఖ్యలపై వివరణ ఇచ్చాడు. అన్ని మతాల్లోనూ ఉగ్రవాదులు ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. అన్ని మతాల్లోనూ ఉగ్రవాదులు, అతివాదులూ ఉన్నారని చరిత్ర చెబుతుందని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు శాంతిని పెంచేందుకే అని కమల్‌ అభిప్రాయపడ్డారు. అరెస్టులకు తాను భయపడనని.. అరెస్టు చేసుకుంటే చేసుకోండి.. కానీ తనను అరెస్టు చేస్తే మరిన్ని సమస్యలు కొని తెచ్చుకున్నట్లే అని తెలిపారు. అరెస్టు విషయంలో తాను హెచ్చరించడం లేదు.. సలహా మాత్రమే ఇస్తున్నానని కమల్‌ హాసన్‌ చెప్పారు.

 

=