లొంగడం ఇష్టం లేక పేల్చేసుకున్నారు... - MicTv.in - Telugu News
mictv telugu

లొంగడం ఇష్టం లేక పేల్చేసుకున్నారు…

August 25, 2017

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఎంతకైనా తెగిస్తారని తాజా ఉదంతం చెబుతోంది. రష్యాలోని ఇగుషెతియా ప్రాంతంలో ఓ ఇంట్లో తిష్టవేసిన ఐసిస్ ఉగ్రవాదులు పోలీసులకు లొంగిపోవడం ఇష్టం లేక తాము తలదాచుకుంటున్న ఇంటిని పేల్చేసుకున్నారు. ఆ ఇంట్లో పెద్ద సంఖ్యలో బాంబులున్నాయి.

ఇవి పేలిపోతుండగా తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పేలుళ్ల ధాటికి ఇంటి కప్పు పైకెగిరిపోయింది. ఇంట్లో మొత్తం నలుగురు ఉగ్రవాదులు ఉన్నారని, అందరూ చచ్చిపోయారని పోలీసులు తెలిపారు.

ఇస్లాం తూచ తప్పకుండా పాటిస్తామని చెప్పే ఐసిస్ ఉగ్రవాదులు దాడుల విషయంలో మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. అమాయకులపై దాడులకు తెగబడుతున్నారు.

ఇస్లాం ప్రకారం ఆత్మహత్య నిషిద్ధమైనప్పటికీ శత్రువులకు భారీ నష్టం చేకూర్చడానికి, వారికి దొరక్కుండా తప్పించుకోవడానికి ఆత్మహత్యకు తెగబడుతున్నారు.