తల్లి ప్రేమకు తలవంచిన ఉగ్రవాదులు..ఆయుధాలు విడిచి - MicTv.in - Telugu News
mictv telugu

తల్లి ప్రేమకు తలవంచిన ఉగ్రవాదులు..ఆయుధాలు విడిచి

July 7, 2022

బిడ్డ పట్ల తల్లిదండ్రులకు ఉండే ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బిడ్డ తప్పు చేస్తున్నాడు అని తెలిసిన వెంటనే తల్లిదండ్రులు అలా తప్పులు చేయటం కరెక్ట్ కాదని, వెంటనే మానుకోవాలని ప్రేమతో బిడ్డను బతిమాలుతారు. తల్లి ప్రేమకు కరుడుగట్టిన ఉగ్రవాదులు సైతం తలవంచిన సంఘటన గురువారం ఉదయం జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే… ఓ ఇద్దరు ఉగ్రవాదులు తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు తమ ఆయుధాలను విడిచిపెట్టి, పోలీసుల ముందు లొంగిపోయారు. కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు జరిపిన యాంటీ టెర్రర్ ఆపరేషన్‌లో ఓ ఇంట్లో ఇద్దరు ముష్కరులు నక్కి ఉన్నారని బలగాలు గుర్తించాయి. వెంటనే వారి తల్లిదండ్రులకు ఆ విషయాన్ని చేరవేశాయి. దాంతో వారు ఎలాగైనా లొంగిపోయేలా ప్రయత్నాలు చేశాయి. ఈ క్రమంలో తల్లిదండ్రులు ఆ ఇద్దరు ఉగ్రవాదులను బతిమాలడంతో ఆయుధాలను విడిచిపెట్టి పోలీసులకు లొంగిపోయారు.

అనంతరం పోలీసులు వారివద్ద నుంచి ఆయుధాలు, భారీగా మందుగుండులను స్వాధీనం చేసుకున్నారు. ”లొంగిపోయిన ఇద్దరు ముష్కరులే. ఇటీవలే ఉగ్రవాద సంస్థల్లో చేరారు. ఈ ప్రాంతంలో ఇంకా ఉగ్రవాదుల అలజడి ఉంది. అందుకే ఇంకా ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాం. ఎన్‌కౌంటర్ చేయకుండా ఇద్దరి ప్రాణాలను రక్షించాం. ఉగ్రవాదం వైపు ఎవరు వెళ్లొద్దు. హింసా మార్గానికి దూరంగా ఉండాలని తల్లిదండ్రులు మీ పిల్లలకు చెప్పాలి. ఉగ్రవాదం విషయంలో తల్లిదండ్రులు సహకరిస్తే, వందల మంది ప్రాణాలను కాపాడవచ్చు” అని కశ్మీర్ ఐకీపీ విజయ్ కుమార్ అన్నారు.