ఉగ్రవాదులు మరోసారి దారుణానికి తెగబడ్డారు. టిక్ టాక్, యూట్యూబ్‌లలో వీడియోలు చేసుకునే అమ్రీన్ భట్ (35) అనే నటిని కాల్చి చంపారు. తన పదేళ్ల వయసున్న మేనల్లుడితో ఆరు బయట కూర్చుని ఉండగా, లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు ఆమెపై కాల్పులు జరిపారు.
ఒక బుల్లెటు మెడలోంచి దూసుకుపోవడంతో అమ్రీన్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మేనల్లుడికి స్వల్ప గాయాలవగా, ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. అమ్రీన్ చనిపోయినట్టు నిర్ధారించగా, మేనల్లుడికి చికిత్స అందిస్తుండడంతో కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు. బుధవారం రాత్రి 8 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం పరిసర ప్రాంతాలన జల్లెడ పడుతున్నారు.