సీఆర్పీఎఫ్ శిబిరంపై ఉగ్రవాదుల గ్రనేడ్‌ దాడి - MicTv.in - Telugu News
mictv telugu

సీఆర్పీఎఫ్ శిబిరంపై ఉగ్రవాదుల గ్రనేడ్‌ దాడి

October 23, 2019

Terrorists' grenade on CRPF camp

ఉగ్రవాదులు మరోమారు రెచ్చిపోయారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్‌పై రగిలిపోతున్న దాయాది దేశం పాకిస్తాన్ అవకాశం దొరికినప్పుడల్లా భారత్‌పై విరుచుకుపడటానికి ప్రయత్నిస్తోంది. తాజాగా జమ్ముకశ్మీర్‌లోని కుల్గామ్‌ జిల్లాలో సీఆర్పీఎఫ్ శిబిరంపై ఉగ్రవాదులు గ్రనేడ్‌ దాడి జరిపారు. 

ఓ జాతీయ వార్తా సంస్థ కథనం ప్రకారం.. ఈ దాడిలో ఒక సీఆర్పీఎఫ్‌ జవాను తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మంగళవారం కశ్మీర్‌ లోయలోని అవంతిపోరా ప్రాంతంలో భద్రతా దళాలు ఉగ్రవాదుల కోసం నిర్బంద తనిఖీలు నిర్వహించాయి. ఈ క్రమంలో ఎదురు కాల్పులు చోటు చేసుకోగా.. ముగ్గురు జైషే ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది.