కశ్మీర్‌లో మరో ఘోరం.. హిందూ బ్యాంక్ మేనేజర్ కాల్చివేత - MicTv.in - Telugu News
mictv telugu

కశ్మీర్‌లో మరో ఘోరం.. హిందూ బ్యాంక్ మేనేజర్ కాల్చివేత

June 2, 2022

జమ్ము కశ్మీర్‌లో మైనార్టీలైన హిందువులపై ఉగ్రవాదుల హింసాకాండ కొనసాగుతోంది. తాజాగా కుల్గామ్ జిల్లాలోని మోహన్ పోరా వద్ద ఉన్న ఎల్లక్వె దేహతి బ్యాంకులో పనిచేస్తున్న మేనేజరు విజయ్ కుమార్‌ని ఉగ్రవాదులు కాల్చి చంపారు. విజయ్ కుమార్ స్వస్థలం రాజస్థాన్‌లోని హనుమాన్ గఢ్ ప్రాంతం. ముందుగా బ్యాంకులోకి ప్రవేశించిన ఉగ్రవాదులు మేనేజరుపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన మేనేజరుని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు విడిచారు. సంఘటనా స్థలి నుంచి షోపియాన్ కేవలం 13 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. కాగా, రెండ్రోజుల ముందు ఓ హిందూ మహిళా టీచరుని ఇలాగే ఉగ్రవాదులు కాల్చి చంపారు. అంతకుముందు ప్రభుత్వ ఆఫీసులో పనిచేస్తున్న కశ్మీరీ పండిట్ రాహుల్ భట్, ఆ తర్వాత ముస్లిం సామాజిక వర్గానికి చెందిన టీవీ ఆర్టిస్ట్ అమ్రీన్ భట్‌ను లష్కరే తోయిబాకు చెందని ఉగ్రవాదులు చంపేశారు. ఇలా జరుగుతున్న వరుస ఘటనలతో అక్కడి మైనార్టీలు, జాతాయవాద ముస్లింలు తమ భద్రతపై ఆందోళన చెందుతున్నారు. అయితే ఇప్పటివరకు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడిన ఉగ్రవాదులను మన భద్రతా బలగాలు వెంటనే గుర్తించి ప్రతీకారం తీర్చుకున్నాయి. మరి విజయ్ కుమార్ విషయంలో అలా జరుగుతుందా? లేదా? అనేది చూడాల్సి ఉంది.