Terrorists shot dead by bank security guard in Jammu and Kashmir.!!
mictv telugu

Jammu And Kashmir : జమ్మూకశ్మీర్‎లో బ్యాంకు సెక్యూరిటీ గార్డు కాల్చి చంపిన టెర్రరిస్టులు.!!

February 26, 2023

Terrorists shot dead by bank security guard in Jammu and Kashmir.!!

జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఆదివారం ఓ పౌరుడిని కాల్చి చంపారు . మృతుడు అచ్చన్ గ్రామానికి చెందిన సంజయ్ పండిట్‌గా గుర్తించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్ర గాయాలైన సంజయ్ పండిట్ ను ఆసుపత్రికి తరలించగా…అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. సంజయ్ పండిట్ బ్యాంకు సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఉగ్రవాదులు కాశ్మీరీ పండిట్ వర్గానికి చెందిన వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. బాధితుడిని దక్షిణ కాశ్మీర్ జిల్లాలోని అచన్ ప్రాంతానికి చెందిన సంజయ్ శర్మ గుర్తించామని, ఈ సంఘటన ఉదయం 11 గంటలకు జరిగిందని పోలీసులు వెల్లడించారు.

ఈ ఘటనపై నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా స్పందించారు. దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లా అచ్చన్‌కు చెందిన సంజయ్ పండిట్ మరణ వార్త వినడం చాలా బాధ కలిగించిందని అన్నారు. బ్యాంకు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న సంజయ్ ఈరోజు ఉదయం ఉగ్రవాదుల దాడిలో చనిపోయాడు. నేను ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు.