Germany Shooting: జర్మనీలోని హాంబర్గ్ చర్చిలో ముష్కరుల కాల్పులు, ఏడుగురు మృతి, పలువురికి గాయాలు..! - Telugu News - Mic tv
mictv telugu

Germany Shooting: జర్మనీలోని హాంబర్గ్ చర్చిలో ముష్కరుల కాల్పులు, ఏడుగురు మృతి, పలువురికి గాయాలు..!

March 10, 2023

జర్మనీలోని హాంబర్గ్ నగరంలో ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఏడుగురు మరణించారు. పలువురు గాయపడ్డారు. ఫోకస్ ఆన్‌లైన్ మీడియాను ఉటంకిస్తూ వార్తా సంస్థ రాయిటర్స్ ఈ సమాచారాన్ని ఇచ్చింది. ఫోకస్ మీడియా నివేదిక ప్రకారం, ఉత్తర జర్మనీలోని హాంబర్గ్ నగరంలో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో దాదాపు ఏడుగురు మరణించగా, ఎనిమిది మంది గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హాంబర్గ్ నగరంలోని ఓ చర్చిలో ఈ దాడి జరిగింది. ఏ ఉద్దేశ్యంతో ఈ దాడులు చేశారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

ఈ కాల్పుల్లో ఏడుగురు మరణించగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారని బిల్డ్ వార్తాపత్రికను ఉటంకిస్తూ వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది. యెహోవాసాక్షి చర్చిలో ఈ కాల్పులు జరిగినట్లు సమాచారం. ఘటనా స్థలంలో భారీ సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించినట్లు పోలీసులు తెలిపారు.