Home > Featured > ఉగ్రవాదుల తీవ్ర హెచ్చరిక.. ఇక నుంచి ఎవరిని చంపుతారంటే

ఉగ్రవాదుల తీవ్ర హెచ్చరిక.. ఇక నుంచి ఎవరిని చంపుతారంటే

జమ్ము కాశ్మీర్‌లో స్థానికేతరులకు ఓటు హక్కు కల్పిస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. అలా ప్రకటించగానే లష్కరే తోయిబాకు అనుబంధంగా పని చేస్తున్న కశ్మీర్ ఫైట్ అనే ఉగ్రవాద సంస్థ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఇక నుంచి ఎలాంటి వారిపై దాడులు జరుగుతాయో జాబితాను విడుదల చేసింది. ‘ఇది జనాభాపరమైన ఉగ్రవాదం. ఎన్నికల సంఘం తాజా నిర్ణయంతో మాకు కలిసివచ్చింది. ఇక నుంచి వీరిని టార్గెట్ చేస్తాం. జాబితా : ప్రతి స్థానికేతరుడు, ఉద్యోగులు, వ్యాపారులు, బిచ్చగాళ్లు, కూలీలు, పర్యాటకులు, పారామిలిటరీ, పోలీసులు, స్థానిక ద్రోహులు, సెటిలర్లను లక్ష్యంగా చేసుకుంటాం. మరిన్ని వివరాలతో కూడిన ప్రణాళికను మా వెబ్‌సైట్‌లో పెడతాం’ అని పేర్కొంది. భారత ప్రభుత్వాన్ని వలసవాద ఫాసిస్టు ప్రభుత్వంగా అభివర్ణించారు.

Updated : 18 Aug 2022 5:24 AM GMT
Tags:    
Next Story
Share it
Top