Tesco delivery person asks customer her age before trying to kiss her on lips
mictv telugu

డెలివరీకి వచ్చి ఆ పని చేశాడు..

November 24, 2022

డెలివరీకి బాయ్ వచ్చాడు.. సరుకులు ఇచ్చాడు.. మళ్లీ కాలింగ్ బెల్ కొట్టాడు.. డోర్ తీస్తే ముద్దు పెట్టబోయాడు. బ్రిటన్‌లో జరిగిన ఈ సీన్ విస్మయానికి గురిచేస్తోంది. మహిళ ఇచ్చిన ఆర్డర్ మేరకు డెలివరీ బాయ్ సరుకులను తీసుకొని వచ్చాడు. అతని నుండి సరుకులు రిసీవ్ చేసుకుని ఆమె లోపలికి వెళ్ళిపోయింది. మళ్లీ మరోసారి కాలింగ్ బెల్ కొట్టాడు. ఆమె రాగానే మాట్లాడం ప్రారంభించాడు. వయస్సు ఎంతని రిక్వస్ట్‌గా అడిగాడు. ఎదో కంపెనీ రూల్ అనుకొని ఆమె 33 సంవత్సరాలు అని చెప్పింది. ఈ క్రమంలో అతడు ఒక్కసారిగా ఆమెను ముద్దు పెట్టడానికి ప్రయత్నించాడు. అప్రమత్తమైన మహిళ అతన్ని విడిపించుకుని వేగంగా లోపలికి వెళ్ళి తలుపు వేసుకుంది. ఇదంతా ఇంటి వద్ద సీసీ కెమెరాలో రికార్డయ్యింది. దీనిలో ట్విస్ట్ ఏంటంటే అతడి వయస్సు 60 సంవత్సరాలుగా తెలిసింది. ఈ ఘటనపై సదరు మహిళ టెస్కో డెలివిరీ కంపెనీపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వారిని ఎలా పనిలో పెట్టుకుంటారని ప్రశ్నిస్తూ మండిపడింది.