టెస్లా గేమింగ్ స్మార్ట్‌ఫోన్ వస్తుంది - ఫీచర్లు ఇవే - MicTv.in - Telugu News
mictv telugu

టెస్లా గేమింగ్ స్మార్ట్‌ఫోన్ వస్తుంది – ఫీచర్లు ఇవే

December 22, 2021

10

టెస్లా పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ‘ఎలక్ట్రిక్ కార్ల కంపెనీని స్థాపించిన అధినేత ఎలాన్ మస్క్’. ఎలాన్ మస్క్ టెస్లా కంపెనీ ద్వారా ప్రపంచమంతట గుర్తింపు తెచ్చుకున్నారు. తమ కంపెనీ ద్వారా ఇప్పటికే వేలల్లో ప్రపంచమంతట ఎలక్ట్రిక్ కార్లను ఎగుమతి చేశారు. తాజాగా తమ కంపెనీ ద్వారా టెస్లా గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌తో మార్కెట్లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. అయితే, ఆ ఫోన్ ధర ఎంత..? ఆ ఫోన్ ఫీచర్స్ ఏంటి అనే పలు అంశాలపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

ఆ వివరాలు మీకోసం.. ఆ స్మార్ట్ ఫోన్‌ను మోడల్ పై/పీ అనే పేరుతో పిలుస్తారని, ఈ స్మార్ట్‌ఫోన్‌లో సైబర్ ట్రక్, పిల్లల్ల కోసం ఎలక్ట్రిక్ వెహికల్, టెస్లా గొడుగు, స్టీల్‌తో చేసిన విజిల్ వంటి పలు అంశాలతో తీసుకొస్తున్నట్లు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే, టెస్లా స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ విషయానికొస్తే.. ఫోన్‌పై భాగంలో నేవీ బ్లూ కలర్, కింద స్కై బ్లూ రంగులతోపాటు, ఫోన్ వెనకవైపు టెస్లా గుర్తుతో “T” అక్షరంతో కూడిన లోగో ఉంటుందని తెలుస్తుంది. అంతేకాకండా 108 ఎంపీతో కూడిన రెండు కెమెరాలుంటాయని, స్నాప్‌డ్రాగన్ 898 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ పనిచేస్తుందని, అలాగే, 6.5. అంగుళాల 4కే రిజల్యూషన్ డిస్‌ప్లే ఉంటుందని, 2 జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌ను ఇస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్ వచ్చే ఏడాదిలో మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇక ధర విషయానికొస్తే.. 800 డాలర్ల నుంచి 1,200 డాలర్ల మధ్య ఉంటుందని అంచనా. అంటే మన దేశ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 60 వేల నుంచి 90 వేల వరకు ఉంటుందని సమాచారం.