టెస్లా అతివిశ్వాసం.. అద్దం పగిలి రూ. 5 వేల కోట్ల నష్టం  - MicTv.in - Telugu News
mictv telugu

టెస్లా అతివిశ్వాసం.. అద్దం పగిలి రూ. 5 వేల కోట్ల నష్టం 

November 25, 2019

వెరైటీ ఫీచర్లతో వాహనాలు తయారు చేయడం అమెరికాకు చెందిన టెస్లా సంస్థ ఘనత. ఆ సంస్థ ఏది చేసినా మార్కెట్లో సంచలనంగానే ఉంటుంది. ఇంతటి ఘనత ఉన్న ఆ సంస్థ తాజాగా ఓ ఎలక్ట్రిక్ ట్రక్‌ను పరిచయం చేసే సమయంలో నవ్వులపాలు కాావాల్సి వచ్చింది. దీని కారణంగా ఆ సంస్థ షేర్లు ఒక్కసారిగా 6 శాతానికి పతనం అయ్యాయి. వెంటనే దీనిపై దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది. 

టెస్లా ఎలక్ట్రిక్ పికప్ ట్రక్‌ను లాస్‌ఏంజెల్స్‌లో కంపెనీ సీఈవో ఎలన్‌ మస్క్ పరిచయం చేసేందుకు ప్రదర్శనకు పెట్టారు. ఆ సమయంలో దాని ఫీచర్స్‌ను వివరించారు. దాని కిటికీ అద్దాలు అసలు పగలవని ఎలన్‌ మస్క్‌ పేర్కొన్నారు. ఆ తర్వాత దాని సామర్థ్యాన్ని పరీక్షించేందుకు  ఒక లోహపు గుండు అద్దాలపైకి విసిరారు. అయితే తానోటి తలిస్తే.. దైవం మరోటి తలిచిందన్న చందంగా అద్దం పగిలిపోయింది. అయినా ఆ వెంటనే మరో అద్దంపైకి మెల్లగా విసిరాడు. అప్పటికీ పరాభావం తప్పలేదు. రెండవది కూడా పగిలిపోవడంతో నవ్వులపాలు కావాల్సి వచ్చింది. 

ఎలక్ట్రిక్‌ కారును ప్రయోగదశలోనే పరీక్షించామని, ఇప్పుడు ఇలా జరగడం ఆశ్చర్యంగా ఉందని ఎలాన్ చెప్పారు. తమ పరీక్షలో కిచెన్‌ సింక్‌ను విసిరినా అద్దం పగల్లేదని పేర్కొన్నారు. వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. లోపాలను వెతికే పనిలో పడ్డారు. డెమోలోనే అద్దాలు పగిలే ఈ వీడియో చూసిన వారు ట్రక్ సామర్థ్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతే కాకుండా ట్రక్‌ డిజైన్‌ కూడా బాగోలేదని ట్రోలింగ్‌ జరిగింది.  దీంతో ఆ సంస్థ షేర్లు ఒక్కసారిగా పతనం అయ్యాయి. కాగా 2021లో ఈ  ట్రక్‌ను మార్కెట్లోకి విడుదల చేయనున్నారు.