ప్రముఖ కార్ల సంస్థ టెస్లా కీలక నిర్ణయం తీసుకుంది. చైనాలో తమ కార్ల ధరలను భారీగా తగ్గించింది. ఇతర సంస్థలతో పోటీ పడేందుకు ఈ నిర్ణయం తీసుకుంది టెస్లా యాజమాన్యం. ఇటీవల తక్కవ ధరకే ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీలు రావడం..వాటి విక్రయాలు పుంజుకోవడంతో టెస్లా యాజమాన్యం నష్టనివారాణ చర్యలు ప్రారంభించింది. దీంతో పాటు చైనాలు టెస్లా కారుల విక్రయాలు క్షీణిస్తుండడతో గత కొద్ది రోజులుగా ధరలు తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా మరోసారి టెస్లా ధరలను తగ్గించింది. ‘మోడల్ 3,’ ‘మోడల్ వై’ కార్లను 40 శాతం తక్కువ ధరకే టెస్లా అందిస్తోంది. ఇదే సమయంలో ‘మోడల్ ఎస్’, ‘మోడల్ ఎక్స్’ కార్లతో ప్రీమియం కస్టమర్లను టార్గెట్ చేసింది.
‘మోడల్ వై’ ఎస్యూవీ ధర 2,88,900 యువాన్ల నుంచి 2,59,900 (37,875 డాలర్లు) యువాన్లకు తగ్గింది. ఈ కారును తొలుత 65 వేల 900 డాలర్లతో మార్కెట్లోకి ప్రవేశ పెట్టారు. ఈ ధరతో పోలిస్తే సుమారు 43 శాతం మేర తగ్గింది. ఇక మోడల్ 3, ధర మొత్తం 30 శాతం తగ్తి 2,29,900 యువాన్లకు తగ్గింది. తాజాగా ప్రవేశపెట్టిన మోడల్ ఎస్ కారు ధర 7,89,900 యువాన్లు. ప్లాడ్ వెర్షన్ (Plaid version) రేటు 1.01 మిలియన్ యువాన్ నుంచి ప్రారంభమవుతుంది. 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 2.1 సెకెనల్లో మాత్రమే అందుకుంటుంది. మోడల్ ఎక్స్ ఎస్యూవీ ధర 8,89,900 యువాన్లుగా ఉంది. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో ఈ కార్లు మార్కెట్లోకి వస్తాయి. 2022లో చైనా నుంచి 7,10,000 టెస్లా వాహనాలు వచ్చాయి.ఇది ప్రపంచవ్యాప్త అమ్మకాలలో ఇది 54 శాతంగా ఉంది.