టెట్ అభ్యర్థుల్లారా.. కీ వచ్చేసింది - MicTv.in - Telugu News
mictv telugu

టెట్ అభ్యర్థుల్లారా.. కీ వచ్చేసింది

June 16, 2022

తెలంగాణ రాష్ట్రంలో జూన్ 12న టెట్ పరీక్ష ముగిసిన విషయం తెలిసిందే. ఈ టెట్ పరీక్షకు సంబంధించి అధికారులు అభ్యర్థులకు ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేశారు. టెట్ పరీక్ష ప్రాథమిక కీ విడుదల చేశామని, tstet.cgg.gov.in అనే వెబ్‌సైట్‌ ద్వారా కీ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని కోరారు. కీ ద్వారా ఏమైనా సమాధానాలపై అభ్యంతరాలుంటే, జూన్‌ 18లోపు ఆన్‌లైన్‌లో సమర్పించాలని అన్నారు.

కన్వీనర్‌ రాధారెడ్డి మాట్లాడుతూ..” రాష్ట్రవ్యాప్తంగా జూన్ 12న జరిగిన టెట్ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని విడుదల చేశాం. అభ్యర్థులు అధికారికి వెబ్‌సైట్ tstet.cgg.gov.in వెళ్లి కీని డౌన్‌లోడ్ చేసుకోవాలి. కీ ద్వారా సమాధానాలపై అభ్యంతరాలుంటే, జూన్‌ 18లోపు ఆన్‌లైన్‌లో సమర్పించండి. ఫైనల్ రిజల్ట్స్‌ను ఈ నెల 27న విడుదల చేస్తాం” అని ఆయన అన్నారు.

మరోపక్క తెలంగాణ టెట్‌ పరీక్షకు 90 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు ఇదివరకే అధికారులు వివరాలను వెల్లడించారు. జూన్ 12 ఉదయం జరిగిన పేపర్‌-1 పరీక్షకు 3,51,482 మంది దరఖాస్తు చేసుకోగా, 3,18,506 మంది (90.62 శాతం) హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పేపర్‌-2 పరీక్షకు 2,77,900 మంది దరఖాస్తు చేసుకోగా, 2,51,070 మంది (90.35 శాతం) హాజరయ్యారు. ఈ క్రమంలో పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని విడుదల చేసినట్లు అధికారులు వెల్లడించారు.