తెలంగాణలో మే నెలలో 'టెట్': శ్రీదేవ సేన - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో మే నెలలో ‘టెట్’: శ్రీదేవ సేన

March 23, 2022

fnnbg

తెలంగాణలో ఖాళీగా ఉన్న 91 వేల ఉద్యోగాలను త్వరలోనే దశల వారీగా భర్తీ చేస్తామని, వెంటనే 80వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆయా శాఖలకు ఆదేశాలు జారీ చేస్తున్నానని కేసీఆర్ మార్చి 9వ తేదీన అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగాలకు సంబంధించిన వివరాలను వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని 33 జిల్లాకు చెందిన నిరుద్యోగులు నోటిఫికేషన్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో టీచర్ జాబ్‌లకు సంబంధించిన తాజా విషయాన్ని అధికారులు వెల్లడించారు.

ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)ను మే నెలలో నిర్వహించేందుకు విద్యాశాఖ సమాయత్తమవుతోందని అధికారులు తెలిపారు. టెట్ నిర్వహణకు అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవ సేన మంగళవారం అధికారులతో సమీక్షించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపారు. ఈ వారంలోనే టెట్‌కు సంబంధించి, విద్యాశాఖ అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. కనీసం 3 లక్షల మంది పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పరీక్ష నిర్వహణ బాధ్యతను రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ)కి అప్పగించారని సమాచారం.