విడుదలైన టెట్- 2017 ఫలితాలు... - MicTv.in - Telugu News
mictv telugu

విడుదలైన టెట్- 2017 ఫలితాలు…

August 4, 2017

టెట్ ఫలితాలు ఈ రోజు విడుదల అయ్యాయి. పేపర్ -1 లో 57.37 శాతం ఉత్తీర్ణులు కాగా, పేపర్ -2 లో 19. 51 శాతం ఉత్తీర్ణుత సాధించారు. మెుత్తం 45,055 మంది పాస్ అయ్యారు. పేపర్- 2 లో గణితం , సైన్స్ లో 20,323 మంది ఉత్తీర్ణులు కాగా, సోషల్ స్టడీస్ లో 24 ,732 పాస్ అయ్యారు. జూలై 23న నిర్వహించిన టెట్ పరీక్షలు పేపర్ -1 ఎగ్జామ్ కు 88.59 శాతం మంది, పేపర్- 2 కు 90.09 శాతం మంది అభ్యర్థులు హాజరుయ్యారు, పేపర్- 1 కు 1,11,647 మంది, పేపర్- 2 కు 12,742 మంది హాజరు కాలేదు. పేపర్ -2 కోసం మెుత్తం 2, 56,265 మంది పరీక్ష రాయల్సి ఉండగా 25,384 మంది గైర్హాజరయ్యారు. ఈ రోజు సాయంత్రం టెట్ ఫలాతాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కిషన్ విడుదల చేశారు. ఫలితాల కోసం http://tstet.cgg.govt.in/ వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు.

ఇదికాక స్కూల్ పిల్లల బ్యాగుల బరువు పై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. స్కూల్ యాజమాన్యం, తల్లిదండ్రులు అందరూ బాధ్యతగా ఉంటున్నారు. డ్రగ్స్ కేసులో స్కూల్, కాలేజీలకు తాము ఎలాంటి నోటీసులు పంపలేదని, ఎక్సెజ్ శాఖ పంపిందని కిషన్ తెలిపారు. ఇది సెన్సిటీవ్ మ్యాటర్ దీనిని ఎక్సెజ్ డిపార్టుమెంట్ చూసుకుంటుందని. పేరెంట్స్ మీటీంగ్ పెట్టి తల్లిదండ్రలుకు అర్థమయ్యేలా అన్నీ చెబుతామన్నారు.