TET results released today .. 4 marks extra
mictv telugu

నేడే టెట్ ఫలితాలు విడుదల.. 4 మార్కులు అదనం

July 1, 2022

తెలంగాణ రాష్ట్రంలో నేడు టెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ ఫలితాలకు సంబంధించి తాజాగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జూలై 1వ తేదీన టెట్ ఫలితాలను వెల్లడిస్తామని తెలిపారు. ఆ మాట ప్రకారమే నేడు టెట్ ఫలితాలను వెల్లడిస్తామని టీఎస్ టెట్ కన్వీనర్ రాధారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

టెట్ కన్వీనర్ రాధారెడ్డి మాట్లాడుతూ..” తెలంగాణ వ్యాప్తంగా జూన్ 12 టెట్ పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు దాదాపు దరఖాస్తులు చేసుకున్న ప్రతి అభ్యర్థి హాజరయ్యారు. గతకొన్ని రోజులుగా టెట్ ఫలితాలు సంబంధించి సోషల్ మీడియాలో ఫలితాలు ఫలానా రోజున వస్తాయి. ఫలానా టైంకి వస్తాయని తెగ ప్రచారం చేశారు. అవన్నీ అవాస్తవం. ఫలితాలను శుక్రవారం విడుదల చేస్తాం. ఇప్పటికే అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశాము. అభ్యర్థులు ఫలితాల కోసం www.tstet.cgg.gov.in వెబ్‌‌సైట్లో చెక్ చేసుకోండి” అని ఆయన అన్నారు.

మరోపక్క టెట్‌లో అదనపు మార్కులు కలుపుతున్నట్టు సమాచారం. బుధవారం టెట్‌ పరీక్షకు సంబంధించిన తుది కీని అధికారులు విడుదల చేయగా అభ్యర్థులు అభ్యర్థనలను పరిగణలోకి తీసుకుని కొన్ని మార్పులు చేసినట్టు తెలుస్తోంది. పేపర్-1లో 4 మార్కులు, సైన్స్ విభాగంలోనూ 4 అదనపు మార్కులు, సోషల్ విభాగంలోనూ 4 అదనపు మార్కులు కలిపారు. ఒక ప్రశ్నకు రెండు ఆప్షన్స్ ఇవ్వడంతో ఈ అదనపు మార్కులను కలపాల్సి వచ్చినట్లు ఓ అధికారి తెలిపారు. పేపర్-1 ప్రాథ మిక కీలో ఇచ్చిన ఒక సమాధానాన్ని మార్చి వేరే ఆప్షన్ ఇచ్చినట్లు పేర్కొన్నారు.