‘జీఎస్టీ’ సినిమా వచ్చేస్తోంది.. - MicTv.in - Telugu News
mictv telugu

‘జీఎస్టీ’ సినిమా వచ్చేస్తోంది..

October 30, 2017

ఈమధ్య వచ్చిన ‘మెర్సల్’ సినిమాలో జీఎస్టీ‌పై ఉన్న  కొన్ని డైలాగులు  వివాదాస్పదమైన  సంగతి తెలిసిందే.  అయితే  ఇప్పుడు  హిందీలో ఏకంగా ‘జీఎస్టీ’ పేరుతోనే  ఓ సినిమా రాబోతుంది.  కింద ట్యాగ్ లైన్‌లో కూడా ‘గల్తీ సిర్ఫ్ తుమారీ’ అంటే ‘తప్పు కేవలం  మీదే’ అని కూడా రాశారు.  వినోదంతో పాటు సందేశాత్మకంగా  నిర్మిస్తున్న ఈ సినిమాలో, మరి జీఎస్టీ గురించి ఏమైనా అంశాలు ఉన్నాయా ? లేక  ‘మెర్సల్ ’సినిమాకు  వచ్చిన  వివాదం కారణంగా ఈ సినిమాకు ‘జీఎస్టీ’ అనే పేరు పెట్టారా అన్నది  సినిమా విడుదలయ్యాకే తెలుస్తుంది. నవంబర్ 17 న ఈ జీఎస్టీ అనే సినిమా విడుదల కానుంది.