గట్టి పిండం.. పిడుగు పడినా బతికాడు..వీడియో - MicTv.in - Telugu News
mictv telugu

గట్టి పిండం.. పిడుగు పడినా బతికాడు..వీడియో

October 9, 2019

అదృష్టం ఉంటే ఎంతటి ప్రమాద నుంచైనా బయటపడగలరు. అమెరికాలో ఓ వ్యక్తి ఏకంగా పిడుగునే జయించడం ఇందుకు నిదర్శనం. టెక్సాస్‌ రాష్ట్రంలో అలెగ్జాండర్‌ కొరియస్‌ అనే వ్యక్తి తన మూడు కుక్కలతో కలిసి పార్కులో నడుస్తున్నాడు. ఇంతలో అతడిపై పిడుగు పడింది. అతడు అక్కడే కుప్పకూలిపోయాడు. 

ఈ దృశ్యాన్ని గమనించిన కొందరు వ్యక్తులు అత్యవసర వైద్యం అందించి.. అంబులెన్స్‌కు సమాచారమివ్వడంతో చావు నుంచి తప్పించుకున్నాడు. తొలుత గుండె స్పందనలు లేకపోవడాన్ని గమనించి వెంటనే గుండె మర్థన చేశారు. అదృష్టవశాత్తూ గుండె స్పందించింది. అనంతరం అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో బాధితుడికి శరీరంలోని అనేకభాగాల్లో ఎముకలు విరిగినట్టు గుర్తించి చికిత్స అందిస్తున్నారు. నేరుగా పిడుగు పడినా అలెగ్జాండర్‌ ప్రాణాలతో బయటపడటం విశేషం. ఈ ఘటన మొత్తం అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.