అమెరికాలో తెలుగు యువకుడికి జైలు శిక్ష.. ఇదీ చిట్టా..  - MicTv.in - Telugu News
mictv telugu

అమెరికాలో తెలుగు యువకుడికి జైలు శిక్ష.. ఇదీ చిట్టా.. 

August 3, 2020

Texas Man Shiva Chandan Reddy Thudi Sentenced to 12 Months and a Day in Prison.

సినిమా నిర్మాతనని చెప్పి ఇక్కడివారిని ఏం బురిడీ కొట్టిస్తాం.. తెల్లవాళ్లను ట్రాప్ చేసి డాలర్లు దోచుకుందాం అనుకున్నాడు ఓ తెలుగు యువకుడు. కానీ, అక్కడి పోలీసులకు అడ్డంగా దొరికిపోయి జైలు పాలయ్యాడు. 26 ఏళ్ల శివ చందన్ రెడ్డి అనే యువకుడు  టెక్సాస్‌లోని ఇర్వింగ్ ప్రాంతంలో గత ఐదు సంవత్సరాలుగా నివసిస్తున్నాడు. అక్కడ తాను ఓ సినిమా నిర్మాతనని నమ్మబలికాడు. తాను ఓ సినిమా తీస్తున్నానని కొంత మంది అమెరికన్ల ముందు చెప్పాడు. నిర్మాణ వ్యయంలో పెట్టుబడులు పెట్టాలని వారికి చెప్పాడు. అతని మాటలు నమ్మిన వారు దాదాపు 1.60 లక్షల డాలర్లను అతనికి ఇచ్చారు. 

వాళ్లు డబ్బులు ఇచ్చాక ఇతను సినిమా ఎంతకీ మొదలు పెట్టకపోవడంతో అమెరికన్లకు అనుమానం వచ్చింది. అతను నిర్మాత కాదని.. తాము ఇచ్చిన డబ్బును శివ చందన్ రెడ్డి,  తన సొంత ప్రయెజనాలకు వాడుకున్నాడని తెలుసుకున్నారు. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన టెక్సాస్ పోలీసులు శివ చందన్ రెడ్డిని అరెస్ట్ చేసి,  కోర్టులో హాజరుపరిచారు. కోర్టు కేసు విచారణలో శివ చందన్ రెడ్డి దోషిగా తేలాడు.  దీంతో అతనికి కోర్టు 12 నెలల జైలు శిక్షను విధిస్తూ తీర్పు ఇచ్చింది.