మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని అత్వేల్లి నేషనల్ హైవే-44పై మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తెలంగాణ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి వాహనం ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునన్నారు. మృతుడు మేడ్చల్ పట్టణానికి చెందిన గౌర్ల నర్సింహులు (58)గా గుర్తించారు. ప్రతాప్ రెడ్డి కారు బైక్‌ను ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది.
వేగంగా వచ్చిన కారు.. బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని ఒక్కసారిగా ఢీకొట్టినట్లు కొందరు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో వంటేరు ప్రతాప్ రెడ్డి కారులోనే ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వంటేరు ప్రతాప్ రెడ్డిని అక్కడి నుంచి పంపిచినట్లు స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.సంఘటన జరిగిన ప్రదేశం నుండి ప్రతాప్ రెడ్డి కారును పోలీసులు తరలించినట్లు తెలుస్తోంది.