వ్యక్తి మూత్ర నాళం నుంచి 32 అడుగుల పురుగు - MicTv.in - Telugu News
mictv telugu

వ్యక్తి మూత్ర నాళం నుంచి 32 అడుగుల పురుగు

December 12, 2019

Thailand man.

కడుపులో పురుగులు ఉండడం సహజమే. చిన్న పరిమాణంలో ఉంటాయి మందులు వేసుకుంటే చనిపోతాయి అనుకుంటారు చాలా మంది. కానీ, అన్ని పురుగులు ఒకేలా ఉండవు. కొన్ని పురుగులు శరీరంలో తిష్ట వేసి మనం తినే ఆహారాన్ని తిని సైజు పెరుగుతాయి. 

ఇటీవల ఈశాన్య థాయిలాండ్‌లోని క్రిట్సాదా ర్యాట్ప్రాచామ్ అనే 44 ఏళ్ల వ్యక్తి మూత్ర నాళం నుంచి 32 అడుగుల టేప్‌వార్మ్ (టేపు తరహాలో ఏలిక పాములా ఉండే పురుగు) బయటికి వచ్చింది. క్రిట్సాదా టాయిలెట్‌కు వెళ్తుండగా కడుపులో ఏదో ఉన్నట్లు అనిపించింది. విసర్జన పూర్తాయిన తరువాత మూత్రాశయాన్ని ఏదో పట్టుకున్నట్లు అనిపించింది. గట్టిగా ప్రయత్నించడంతో మూత్ర నాళం నుంచి తాడు లాంటింది కిందికి వేలాడింది. దాన్ని చేతులతో పట్టుకుని బయటకు లాగడం మొదలుపెట్టాడు. అది లాగే కొద్ది వస్తూనే ఉంది. దీంతో అతడు కలవరపడ్డాడు. కొద్ది సేపటి తర్వాత అది మొత్తం బయటకు వచ్చేసింది. అతడి ప్రేయసి నర్సు కావడంతో దాన్ని ఫొటో తీసి ఆమెకు పంపాడు. అది టేప్‌వార్మ్ అని, శరీర అవయవాల్లో అది పెరుగుతుందని ఆమె చెప్పింది. ఫొటోలు తీసిన తర్వాత అతడు దాన్ని టాయిలెట్‌లోనే పడేసి ఫ్లష్ చేశాడు. ఆ ఫొటోలను ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.