మనిషి కడుపులో 17 అడుగుల పచ్చ జంతువు - MicTv.in - Telugu News
mictv telugu

మనిషి కడుపులో 17 అడుగుల పచ్చ జంతువు

September 24, 2020

అతనికి మాంసం అంటే ఇష్టం. ఎంత ఇష్టమంటే.. ఉడికేలోపే ముక్కల్ని గుటుకున పొట్టలోపలికి తోసుకునేంత. ఆ ఆత్రమే అతని పొట్టను ముంచేసింది. కడుపులో ఏకంగా 17 అడుగుల పొడవైన ‘పచ్చ పాము’కు దూరడానికి అవకాశం కల్పించింది. దాని ధాటికి అతనికి నిద్ర కరవై, ఆరోగ్యం పాడై, ఆస్పత్రి పాలయ్యాడు. 

థాయ్‌లాండ్‌లోని నఖోవ్ సావాన్ ప్రాంతానికి చెరందిన దియాంగ్చాన్ దాచ్యోడే వేదన ఇది. అతనికి కొన్నాళ్లుగా తీవ్రమైన కడుపునొప్పి వస్తోంది. ఇటీవల టాయ్‌లెట్‌కు వెళ్లినప్పుడు మలద్వారం నుంచి పసుప్పచ్చని పాములాంటిది కనిపించడంతో బెంబేలెత్తిపోయాడు. ఏదో గ్రహాంతరవాసి తనలోకి దూరిందని ఠారెత్తి ఆస్పత్రికి పరిగెత్తాడు. వైద్యులు అతని కడుపులోంచి 17 అడుగుల టేప్‌వార్మ్‌ను బయటికి తీసి ప్రాణం కాపాడారు. ఉడకని మాంసాన్ని తినడం వల్ల కడుపులో ఇలాంటి నులిపురుగులు చేరతాయని, ఇది టేనియా సగినటా జాతికి చెందిన నులిపురుగు అని వైద్యులు వెల్లడించారు.