పెళ్లిల్లు స్వర్గంలో జరుగుతాయంటారు. ఎవ్వరికి ఎప్పుడు ముడి పడాలో ఆ దేవుడు ఎప్పుడో నిర్ణయించాడు అని అంటారు. అది నిజమేనేమో అని అనిపిస్తుంది ఈ పెళ్లిని చూస్తుంటే. థాయ్‌ల్యాండ్ కు చెందిన ఓ ట్రాన్స్‌జెండర్ ఏకంగా కోటీశ్వరుడైన ఓ వ్యాపారిని పెళ్లి చేసుకుని అందరిని ఆశ్చర్యపరిచింది.
థాయ్‌ల్యాండ్ కు చెందిన పోయిడ్ ట్రిచాడ పుట్టుకతో అబ్బాయి. అతనిలో అమ్మాయి లక్షణాలను గుర్తించి 17 ఏళ్ల వయసులో లింగమార్పిడి ద్వారా అమ్మాయిగా మారింది. అందగత్తె అయిన ఈ ట్రాన్స్‌జెండర్ అందాల పోటీల్లోనూ విజేతగా నిలిచింది. తరువాత సినిమాల్లో అవకాశాలను దక్కించుకుని స్టార్డమ్ ను సంపాదించుకుంది. ఇదే క్రమంలో ఈ బ్యూటీ పుకెట్ ప్రావిన్స్‌కు చెందిన బడా బిజినెస్మెన్ ఓక్ హ్యాంగ్యోక్‌ను పెళ్లాడి అందరి దృష్టి తనపై పడేలా చేసింది. 36 ఏళ్ల పోయిడ్ అందం చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. ఈమె ట్రాన్స్‌జెండర్ అంటే ఎవరూ నమ్మరు. అంతటి అందగత్తె పోయిడ్. హీరోయిన్ గా సినిమాల్లో నటిస్తూనే మరోవైపు బిజినెస్‌లు చేస్తోంది.
పుకెట్లోని బాన్ అర్-జోర్‌లో వీరి వివాహం అత్యంత వైభంగా జరిగింది. ఈ వేడుకను తమ సాంప్రదాయ పెరనాకన్ శైలిలో జరుపుకున్నారు. వధూవరులు ఇద్దరూ పెరనాకన్ వివాహ దుస్తులను ధరించారు. వీరిద్దరూ పెళ్లి బట్టల కోసం రూ.4.75 కోట్లను ఖర్చుచేశారట. పోయిడ్ ధరించిన పెళ్లి గౌను పూర్తిగా బంగారు దారంతో , పురాతన బంగారు ఆభరణాలతో ఎంబ్రాయిడరీ చేయబడింది. రానాంగ్ ప్రావిన్స్‌కు చెందిన కళాకారులు తమ స్వహస్తాలతో స్వచ్ఛమైన బంగారంతో కిరీటాన్ని తయారు చేశారు. ఈ కిరీటం పూర్తి కావడానికి దాదాపు మూడు నెలలు పట్టిందట.