గాల్లో బిడ్డకు జన్మనిచ్చిన మహిళ! - MicTv.in - Telugu News
mictv telugu

గాల్లో బిడ్డకు జన్మనిచ్చిన మహిళ!

February 4, 2020

chinna

థాయిలాండ్‌కు చెందిన ఓ మహిళ గాల్లో ఉన్న విమానంలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. నిండు గర్భిణి అయిన సదరు యువతి ఖతార్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన క్యూఆర్ 830 విమానంలో దోహా నుంచి బ్యాంకాక్‌కు వెళ్తోంది. గాల్లో విమానం ప్రయాణిస్తుండగా ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో గాల్లోనే బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంఘటన తెల్లవారుజామున 3 గంటలకు జరిగింది. 

ఈ విషయం తెలిసిన పైలట్ ఆ విమానాన్ని కోల్‌కతాలోని నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో ఎమెర్జెన్సీ ల్యాండింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు కోల్కతా ఎయిర్‌పోర్ట్ అధికారుల అనుమతి కోరాడు. కోల్కతా ఏటీసీ అధికారులు అనుమతి ఇవ్వడంతో ఆ విమానాన్ని ఎమెర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. అక్కడి నుంచి అంబులెన్సులో ఆమెను ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కి తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డల ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.