డిగ్రీ పట్టా అందుకున్న 91 ఏండ్ల బామ్మ…

చదువుకోవాడానికి వయస్సుతో సంబంధం లేదని 91 సంవత్సరాల ఈ బామ్మ నిరూపించింది. థాయిలాండ్ కు చెందిన కిమ్లన్ జినకుల్ అనే మహిళ పది సంవత్సరాలు కష్టపడి చదివింది. మానవ, కుంటుంబ అభివృద్ది అంశాలలో కోర్స్ పూర్తి చేసింది. థాయిలాండ్ మహారాజు వజిరలాంగ్ కార్న్ చేతుల మీదగా డిగ్రీ పట్టాను అందుకుంది.

చదువుకోవడానికి బద్దకంగా ఉండే యువతకు ఈ బామ్మ ఆదర్శంగా నిలిచిందని సోషల్ మీడియాలో నెటిజన్లు బామ్మ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మనసులో సంకల్పం బలంగా వుండాలే గానీ దానికి వయసు అడ్డమే కాదు. ఏ వయసులోనైనా ఏమైనా సాధించవచ్చని ఈమెని చూస్తే తెలుస్తోంది.

SHARE